జన్నారం : ఉపాధి హామీ పథకంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ అంజయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య పాల్గొన్నారు. మండలంలోని చింతగూడలో పని చేయకుండా 660 క్యూబిక్ మీటర్లు ఎక్కువగా నమోదు చేశారని తనిఖీ బృందం తేల్చింది. దీంతో సంబంధీకుల నుంచి రూ.73 వేలు రికవరీ చేయూలని పీడీ ఆదేశించా రు. ధర్మారం బీపీఎం కూలీ డబ్బులు ఇవ్వకుండా తి ప్పించుకుంటున్నారని కూలీలు తెలిపారు. బీపీఎంను తొలగించాలని గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీంతో సూపరింటెండెంట్‌కు లేఖ రాస్తామని అదనపు పీడీ తెలిపారు. కవ్వాల్‌లో మేట్లు పని చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారని తనిఖీ బృందం వెల్లడించింది. వారం వారం పే స్లిప్పులు ఇవ్వకుండా నె లకు ఒకేసారి ఇస్తున్నారని, దీంతో తమకు కూలి ఎంత వచ్చిందో తెలియడం లేదని కూలీలు ఆరోపించారు. దీంతో సంబంధిత ఎఫ్‌ఏపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పని చేయని మేట్లను తొలగించాలని, కూలీ డబ్బుల చెల్లింపులో జాప్యం చేయొద్దని అన్నారు. 28 మంది కూలీలకు జాబ్ కార్డులు అందేలా చూడాలని తెలిపారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని, తమకు తెలియకుండానే తమ పేర్ల తో డబ్బులు తపాలపూర్ కూలీలు వేదికపైకి తోసుకురావడంతో గందరగోళం ఏర్పడింది.
ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు, తపాలపూర్ గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. తపాలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ బినామీ పేర్లతో కూలీలకు తెలియకుండా డ బ్బులు తీసుకుందని గ్రామానికి చెందిన భీమయ్య, దుంపల పద్మ, కుమారస్వామి, చిరుత గణపతి, వీర య్య ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుం టామని అదనపు పీడీ తెలిపారు. ప్రజావేదికలో సుమా రు రూ.లక్ష వరకు రికవరీకి అదనపు పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, ఎస్‌ఆర్‌పీ మహేశ్వర్, ఏపీఓ మల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో అక్రమాలు
Published Thu, Mar 12 2015 4:25 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement