కళాకారులతో సెల్ఫీ తీసుకుంటున్న సినీ నటుడు ఆది పినిశెట్టి
గుంటూరు వెస్ట్: ‘ఆరోగ్యం కోసం నడక– గుంటూరు కోసం నడక’ నినాదంతో నిర్వహించిన 10కే వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం ఉదయం స్థానిక విద్యానగర్‌లోని ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ముందు ప్రారంభమైన ఈ పోటీలకు సినీ నటుడు ఆది పినిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌రెడ్డి నవ్వులను పూయించారు. కార్యక్రమ నిర్వహణా బాధ్యతను పోటీల కన్వీనర్ కోయ సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు చైతన్యమెక్కువన్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈవెంట్స్‌ను బాగా ఆదరిస్తారని కొనియాడారు. 10కే వాక్ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం ఆది, తదితర నాయకులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. యువత కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనంద్‌బాబు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్.వి.ఆర్. క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర (నాని), అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు, డీఎస్పీ శ్రీజ, మలినేని కాలేజ్ డైరెక్టర్, చైర్మన్ మలినేని పెరుమాళ్ సుధాకర్, లాల్ వజీర్, వజ్జా రామకృష్ణ పాల్గొన్నారు.
విజేతలు : అండర్–16 బాలురు : ఎం.కృష్ణమూర్తి నాయక్, బి.భరత్ రాజ్, షేక్ అబ్దుల్ రెహ్మాన్. అండర్ –16 బాలికలు : బి.నాగ హారిక, కె.అశ్విని భాయ్, బి.శ్రీనిధి. అండర్–25 యువకులు: బి.కాంతారావు, పి.రవి, షేక్ సుభాని అండర్–25 మహిళలు: ఐ.రాజేశ్వరి, పి.విజయ లక్ష్మి, షేక్ నూర్జహాన్‌లు వరుసగా ప్ర«థమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే వెటరన్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో కూడా పలువురు బహుమతులందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment