10K Run
-
ఉత్సాహంగా 10కే రన్ (ఫొటోలు)
-
మారథాన్.. ధనాధన్
-
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 10కె, 5కె రన్ ఫోటోలు..
-
‘షి’ ఈజ్ రన్
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 2కే రన్ నిర్వహించారు.ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో ‘వీఆర్1’ పేరుతో జరిగిన పరుగులో గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సినీనటి పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనగర్‌కాలనీ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10కే, 5కే, 2కే రన్లను ఘనంగా నిర్వహించారు. ‘వీఆర్–1’ పేరుతో జరిగిన ఈ పరుగును నెక్లెస్ రోడ్డులో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. నగర సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అడిషినల్ సీపీ (క్రైమ్స్) శిఖా గోయల్, రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, అమెరికన్ కాన్సులేట్ క్యాథరిన్ హడ్డా, హీరోయిన్స్ నిహారిక, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అతిథులంతా 2కే రన్లో పాల్గొని రన్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రన్ ప్రారంభ వేదిక వద్ద గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో దిగ్విజయంగా విజయాలు సాధిస్తున్నారని, నగరంలో మహిళలతో పాటు అందరికీ భద్రత ఉందన్నారు. పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ సేప్టీ నగరమని, ఎవరైనా ఇక్కడ సంతోషంగా నిర్భయంగా జీవించవచ్చునన్నారు. శిఖా గోయల్ ‘ఉమెన్ సేఫ్టీ’తో పాటు పలు విభిన్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఇటీవల ఓ అమెరికన్ సంస్థ సర్వేలో హైదరాబాద్ మహానగరం సేఫ్టీ సిటీగా నిలిచిందని గుర్తుచేశారు. లక్డీకాపూల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీ విద్యార్థులు రన్లో పాల్గొని గాంధీజీ 150 జయంతోత్సవాల సందర్భంగా గాంధీజీ సూక్తుల బుక్లెట్లను పంపిణీ చేశారు. ఈ రన్లో విదేశీయులు, బ్లేడ్ రన్నర్లు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
‘షి’ ఈజ్ రన్
-
10కే వాక్ అదుర్స్
గుంటూరు వెస్ట్: ‘ఆరోగ్యం కోసం నడక– గుంటూరు కోసం నడక’ నినాదంతో నిర్వహించిన 10కే వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం ఉదయం స్థానిక విద్యానగర్‌లోని ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ముందు ప్రారంభమైన ఈ పోటీలకు సినీ నటుడు ఆది పినిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌రెడ్డి నవ్వులను పూయించారు. కార్యక్రమ నిర్వహణా బాధ్యతను పోటీల కన్వీనర్ కోయ సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు చైతన్యమెక్కువన్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈవెంట్స్‌ను బాగా ఆదరిస్తారని కొనియాడారు. 10కే వాక్ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆది, తదితర నాయకులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. యువత కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనంద్‌బాబు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్.వి.ఆర్. క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర (నాని), అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు, డీఎస్పీ శ్రీజ, మలినేని కాలేజ్ డైరెక్టర్, చైర్మన్ మలినేని పెరుమాళ్ సుధాకర్, లాల్ వజీర్, వజ్జా రామకృష్ణ పాల్గొన్నారు. విజేతలు : అండర్–16 బాలురు : ఎం.కృష్ణమూర్తి నాయక్, బి.భరత్ రాజ్, షేక్ అబ్దుల్ రెహ్మాన్. అండర్ –16 బాలికలు : బి.నాగ హారిక, కె.అశ్విని భాయ్, బి.శ్రీనిధి. అండర్–25 యువకులు: బి.కాంతారావు, పి.రవి, షేక్ సుభాని అండర్–25 మహిళలు: ఐ.రాజేశ్వరి, పి.విజయ లక్ష్మి, షేక్ నూర్జహాన్‌లు వరుసగా ప్ర«థమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే వెటరన్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో కూడా పలువురు బహుమతులందుకున్నారు. -
ఫిబ్రవరి 10న ‘రన్ ఫర్ గ్రీన్’
-
హైదరాబాద్ 10కే రన్
-
‘ప్రతి ఒక్కరూ ఓటు వేసి నగర ఔనత్యాన్ని నిలబెట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 10కే రన్‌కు విశేష స్పందన లభించింది. ‘మై ఓట్, మై సిటీ, మై రన్’ అనే పేరుతో నిర్వహించిన ఈ రన్లో దాదాపు 5వేల మంది పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, సినీ నటులు రాశీఖన్నా, తమన్నా,సందీప్ కిషన్, నవదీప్‌తో పాటు పెద్ద ఎత్తున యువత ఈ రన్‌కు తరలివచ్చారు. దాన కిషోర్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా అక్షరాస్యత 90శాతం ఉన్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం గ్రామీణ ప్రాంతాల కన్నా అతి తక్కువగా కేవలం 53శాతం మాత్రమే నమోదు కావడం బాధాకరం అన్నారు. డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేసి హైదరాబాద్ ఔనత్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ రన్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీ ఫ్యాట్ మిషన్లను ఏర్పాటు చేసి మాక్ పోల్ నిర్వహించారు. -
విరాట్ వీర విహారం.. విండీస్‌కు భారీ లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (157: 129 బంతులు, 13 ఫోర్లు, 4 సిక్స్‌లు, నాటౌట్) మరోసారి శతక్కొట్టాడు. కోహ్లికి తోడుగా రాయుడు(73) రఫ్పాడించడంతో విండీస్‌కు 322 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) ఈ సారి తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడేప్రయత్నం చేశాడు. కానీ ధావన్ సైతం (29) పెవిలియన్ చేరడంతో భారత్ 10ఓవర్లకు రెండు వికెట్ల నష్టపోయి 49 పరుగుల మాత్రమే చేయగలిగింది. రఫ్ఫాడించిన రాయుడు.. మిడిలార్డర్ ప్రయోగంలో భాగంగా నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తన బాధ్యతను నిర్వర్తించాడు. నాలుగోస్థానానికి తను సరిగ్గా సరిపోతానని నిరూపించుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆచితూచి ఆడుతూ.. కెప్టెన్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ అవకాశం చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో తొలుత 56 బంతుల్లో 5 ఫోర్లతో కెప్టెన్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ వెంటనే రాయుడు సైతం 61 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాయుడు(73)ని అశ్లేనర్స్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విరాట్ పర్వం మొదలు.. రాయుడు వికెట్ అనంతరం విరాట్ రికార్డుల పర్వం మొదలైంది. క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లి చెలరేగాడు. తొలుత 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే మరికాసేపటికే భారత్ ధోని (20) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ దాటిగా ఆడే ప్రయంత్నం చేశాడు. కానీ వికెట్ల ముందు దొరికి పంత్(17) పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్న కోహ్లి మాత్రం తన ఆటలో వేగాన్ని తగ్గించలేదు. ఈ క్రమంలో 106 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 37వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. అచ్చొచ్చిన మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అశ్లేనర్స్, ఒబెడ్లకు రెండు వికెట్లు దక్కగా రోచ్, సామ్యూల్స్లకు తలా వికెట్ లభించింది. -
కోహ్లి కొట్టేశాడు.. సచిన్ రికార్డు బ్రేక్
-
కోహ్లి కొట్టేశాడు.. సచిన్ రికార్డు బ్రేక్
సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అచ్చొచ్చిన మైదానంలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే కోహ్లి మాత్రం 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఫీట్ సాధించడానికి కోహ్లి 81 పరుగులు దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అశ్లేనర్స్ వేసిన 37వ ఓవర్ మూడో బంతిని కోహ్లి సింగిల్ తీసి 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ క్లబ్లో చేరిన ఐదో భారత ఆటగాడిగా ఓవరాల్ 13వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కోహ్లి కన్నా ముందు భారత నుంచి సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనిలు ఈ ఫీట్నందుకున్నారు. కోహ్లి అతితక్కువ ఇన్నింగ్స్‌లోనే కాకుండా అతి తక్కువ రోజులు, బంతుల్లోనే 10వేల మార్క్‌ను అందుకున్నాడు. అంతేకాకుండా ఎక్కువ సగటుతో (59.17)తో ఈ క్లబ్లో చేరాడు. అంతర్జాతీయ వన్డేల్లో అరేంగేట్రం చేసిన 3270 రోజుల్లోనే కోహ్లి 10వేల జాబితాలో చేరాడు. ఇప్పటి వరకు ద్రవిడ్ ఒక్కడే 3969 రోజుల్లో ఈఘనతను అందుకోగా కోహ్లి తాజాగా అధిగమించాడు. జయసూర్య 11296 బంతుల్లో 10వేల పరుగులు పూర్తి చేయగా కోహ్లి కేవలం 10813 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక కోహ్లి ఖాతాలో 36 సెంచరీలున్నాయి. గువాహటి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. -
మారథాన్ మానియా
-
ధోని మరో అరుదైన ఘనత
-
దిగ్గజాల సరసన ధోని
లార్డ్స్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ జార్ఖండ్ డైనమైట్ 10 వేల పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు ధోని కన్న ముందు ఈ మైలురాయిని అందుకున్నారు. ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్ అందుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా ఈ 36 ఏళ్ల ఆటగాడు నిలిచాడు. ఈ జాబితాలో 18,426 పరుగులతో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సంగక్కర(14,234), రికీ పాటింగ్ (13,704), జయసూర్య(13,430), మహేళ జయవర్ధనే (12,650), ఇంజుమామ్ ఉల్ హక్(11,739), జాక్వస్ కల్లీస్ (11,579), సౌరవ్ గంగూలీ(11,363), ద్రవిడ్(10,889), బ్రియన్ లారా (10,405), దిల్షాన్ (10,290)లున్నారు. -
నెక్లెస్‌రోడ్‌లో షీటీమ్స్ ఆధ్వర్యంలో 10కె రన్