వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అచ్చొచ్చిన మైదానంలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.