
11న జగన్ రాక
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 11న నగరానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని నియోజక వర్గాల వారీగా సార్వత్రిక ఎన్నికల
- విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ స్థానాలపై సమీక్ష
- ప్రజా సమస్యలపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 11న నగరానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని నియోజక వర్గాల వారీగా సార్వత్రిక ఎన్నికల గెలపోటములపై సమీక్షించనున్నారు. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే సమీక్ష నిర్వహించనున్నారు.
మొత్తం రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాలతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని జగ్గం పేట, కాకినాడ అసెంబ్లీ స్థానాలపైనా సమీక్ష జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షలో భాగంగా జగన్ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు మున్ముందు ప్రజాసమస్యలపై పార్టీ పరంగా పోరాటం చేసేవిధంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 12వ తేదీతో సమీక్షలు ముగుస్తాయి.