నర్సీపట్నంలో 11 తిరస్కరణ
- యలమంచిలిలో నామినేషన్లన్నీ సక్రమమే
- 18 తేదీ వరకు ఉపసంహరణకు గడువు
నర్సీపట్నం/యలమంచిలి,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్ని కల రెండో ఘట్టం ముగిసింది. నర్సీపట్నంలోని 27 వార్డులకు 160, యలమంచిలిలోని 24 వార్డులకు 135 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని ఎన్నికల అధికారితోపాటు అసిస్టెంట్ ఎన్నికల అధికారులు, ఎంపీడీవో, సిబ్బంది శనివారం నిశితంగా పరిశీలించా రు.
నామినేషన్ పత్రాలతో సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాలు, పన్నుల బకాయిలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. యలమంచిలిలో 135 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. వివిధ కారణాల రీత్యా నర్సీపట్నంలో 11 నామినేషన్లను తిరస్కరించినట్టు అక్కడి ఎన్నికల అధికారి పి.సింహాచలం తెలిపా రు.
ఇక్కడ 8 మంది అభ్యర్థులు రెం డేసి సెట్ల నామినేషన్ వేయడం తో పాటు, రెండు నామినేషన్లలో ఒకే వ్య క్తి ఇద్దరిని ప్రతిపాదించడం, వయ స్సు సరిపోకపోవడంతో మరొకటి తిరస్కరించారు. ఉపసంహరణ కు 18వ తేదీ సాయంత్రం 3గంటల వర కు గడువు ఉంది. పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నందున ఆయా అభ్యర్థులు బీ-ఫారంలను సమర్పించాలని అధికారులు సూచించా రు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.