లావేరు, న్యూస్‌లైన్ : మండలంలోని గుమడాం పంచాయతీలో ఇసుక అక్రమ నిల్వలపై మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గుమడాం గెడ్డలో ఇసుకను తరలించి పొలాల్లో నిల్వ చేసినట్లు మండల టాస్క్‌ఫోర్స్ కమిటీకి సమాచారం అందింది. దీంతో మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులైన తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, ఎస్సై రామారావు దాడులు చేపట్టారు. గుమడాం గ్రామానికి చెం దిన యాలాల గోవిందరావు, గొరుసుపూడి శ్రీనివాసరావు ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి గుమడాం పంచాయతీ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఆరు చోట్ల ఇసుక నిల్వలు వేశారు. వీటిని పరిశీలించిన అధికారులు స్వాధీ నం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను గుమడాం సర్పంచ్ దురగాసి భార్గవి, వీఆర్వో శ్రీనివాసరావుకు అప్పగించారు. ఈ ఇసుకను తరలించకుండా చూడాలని గుమడాం పంచాయతీ వీఆర్వో, వీఆర్‌ఏలను అధికారులు ఆదేశించారు. దాడుల్లో ఆర్‌ఐ సి.సన్యాసిరావు, వీఆర్‌ఓ శ్రీనివాసరావు, సర్పంచ్ ప్రతినిధి దురగాసి ధర్మారావు పాల్గొన్నారు.
ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు
సీజ్ చేసిన ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు తప్పవని మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు జల్లేపల్లి రామారావు, ఎం.కిరణ్‌కుమార్, ఎస్సై రామారావు హెచ్చరించారు. గుమడాం పంచాయతీలో అనధికారికంగా నిల్వ వుంచిన 118 ట్రాక్టర్లు ఇసుకను సీజ్ చేసిన విషయాన్ని టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు, డుమా పిడి కల్యాణచక్రవర్తికి తెలిపారు.
ఇసుకాసురుల గుండెల్లో గుబులు
టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారుల దాడులు ఇసుకాసురుల గుండెల్లో గుబులు పట్టుకుంది. మండలంలోని గుమడాం, బుడతవలస, బుడుమూరు, రొంపివలస, తామాడ, నేతేరు, లక్ష్మిపురం, గురుగుబిల్లి, కొత్తకోట వద్ద గల గెడ్డల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇంతవరకూ అధికారులు పట్టించుకోకపోవడంతో మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లలా ఇసుక అక్రమ వ్యాపారం సాగింది. అధికారుల దాడులతో ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు పేర్కొన్నారు.
118 ట్రాక్టర్ల ఇసుక పోగులు సీజ్
Published Sat, Dec 7 2013 3:33 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement