illegal sand mafia
-
చేసేదే దొంగ పని.. అందులోనూ వైరం.. కాల్పులు జరపటంతో.. !
పాట్నా: ఇసుక అక్రమ రవాణాలో రెండు ముఠాల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపటంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్‌లోని బిహ్తా నగరంలో గురువారం జరిగింది. సన్ రివర్ నుంచి అక్రమంగా ఇసుక తరలించటంలో రెండు గ్రూపులు నిమగ్నమయ్యాయి. ఈ విషయంపైనే మాటా మాటా పెరిగి దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తూటాలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 13న బిహార్‌లోని బెగుసరాయ్‌లో జాతీయ రహదారులు 28, 31పై బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే ఇలా రెండు ముఠాలు కాల్పులు జరపటం గమనార్హం. ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
జగిత్యాలలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
-
ఇసుక దోపిడీపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్
-
రేపల్లెలో అధికారపార్టీ నేతల అక్రమాలు
-
అధికార పార్టీ నేతల అండతోనే ఇసుక తవ్వకాలు
-
పశ్చిన గోదావరి జిల్లాలో జోరుగా ఇసుకు రవాణా
-
ధ్వంస రచన .. అధికార భజన
తాండవ నదిలో పొక్లైనర్తో చేపట్టిన ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులిచ్చిన ఫిర్యాదు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళ్లి అడ్డుకోగా స్థానిక టీడీపీ నేతలు ప్రోత్సహించి కేసులు పెట్టించారు. దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు చేయించారు. అక్రమాన్ని అడ్డుకున్నందుకు తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పెదపూడి మండలం చాపరం గ్రామంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చింపేశారని ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే అటువైపు (టీడీపీ నాయకుల) నుంచి కూడా ఫిర్యాదు తీసుకుని ఇటు వైపు వారిని కూడా అరెస్టు చేసిన ఘటన చోటుచేసుకుంది. కాకినాడలోని తారకరామనగర్‌లో ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు బలవంతంగా పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేస్తుంటే బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి, వెనక్కి తగ్గాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పెదపూడి మండలం శహపురం గ్రామంలో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని టీడీపీ నాయకులు ర్యాలీ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వైఎస్సార్‌పార్టీ నాయకుల మోటార్ బైక్‌లను ధ్వంసం చేశారు. దీనిపై అధికార టీడీపీ నాయకులు బైక్‌లు పాడైన వైఎస్సార్ పార్టీ నాయకులపైనే అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేశారు. కాపు ఐక్య గర్జన దాడి ఘటనలో సంబంధంలేని ఎస్సీ, బీసీలు, ఇతర కులాల నాయకులపై బలవంతంగా కేసులు పెట్టారు. వీరంతా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో అరెస్టులను తప్పించుకున్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోటనందూరు మండలం భీమవరపుకోట సర్పంచి జిగటాల వీరబాబు (వికలాంగుడు, ఎస్సీ)పై కేసు పెట్టారు. కోటనందూరు మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ (ఎస్సీ) అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారన్న వాదనలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా కేసులుండవు. ఒకవేళ పెట్టినా బెయిలబుల్ కేసులతో సరిపెట్టేస్తున్నారు. పోలీసులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినా ఫర్వాలేదు గానీ టీడీపీ నాయకులపై మాత్రం ఈగ వాలకూడదన్నట్టుగా అధికారులు కాపాడుతూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తున్నారు. తటస్థులు, ప్రతిపక్ష నేతలపై మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా నాన్ బెయిల్‌బుల్ కేసులు బనాయించి, అరెస్టులు చేసేవరకు వదలడం లేదు. ఇప్పుడిది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా నడుస్తున్న రెండు విధ్వంస ఘటనలే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ధ్వంసం ఘటనపై కేసులేవీ..? ప్రభుత్వ నిధులతో వేసిన రహదారిని ధ్వంసం చేసిన కేసును గాలికొదిలేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని కలెక్టర్ చేసిన ప్రకటన ఉత్తిదేనని తేలిపోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికార యంత్రాంగం దాసోహమైపోయిందని స్పష్టమైంది. కాకినాడ మహలక్ష్మీనగర్‌లో రహదారి ధ్వంసం చేసిన వివాదం నెల రోజులు దాటుతున్నా చర్యల్లేవు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) సోదరుడు సత్యనారాయణ, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్‌తోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు రహదారిని ధ్వంసం చేశారు. రహదారి వేసిన ప్రాంతమంతా తమదని రౌడీయిజం చేసి, పొక్లెన్ల సాయంతో విధ్వంసం సృష్టించారు. ఈ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమవడంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పథక రచన చేశారు. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ట్రైనీ కలెక్టర్‌తో విచారణ చేపడుతున్నామని, నిందితులెవరైనా విడిచిపెట్టేది లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా లీకులు ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతకుముందు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ, సోదరుడు కుమారుడు ఉమాశంకర్ సహా ఏడుగురిపై హడావుడిగా కేసు నమోదు చేసి, బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి ‘మమ’ అనిపించేశారు. దీనికంతటికీ టీడీపీ పాలక పెద్దల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. వెలుగుబంటి విధ్వంసంపైనా... కడియం మండలం వేమగిరిలో ప్రభుత్వానికి చెందిన కంకర గుట్టను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుడు వెలుగుబంటి వెంకటాచలం అక్రమంగా తవ్వేశారు. సుమారు 80 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా తవ్వేశారు. తవ్వకాలకు అడ్డొచ్చిన విద్యుత్తు స్తంభాలను కూల్చేశారు. అక్కడున్న ఇళ్లకు రక్షణగా నిలిచిన గోడను తొలిచేశారు. ఇళ్లకు ముప్పు వాటిల్లే విధంగా తవ్వకాలు జరిపేశారు. ఫలితంగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా తనకు అడ్డొచ్చిన మహిళపై అనుచితంగా వ్యవహరించారు. వీటిన్నింటిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.8.61 కోట్లమేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆమేరకు రికవరీ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ అరెస్టులు జరగలేదు. రికవరీ నోటీసుల వివరణ గడువు పూర్తయి వారాలు గడుస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైనా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పుడు దళిత సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చెప్పుకుపోతే జిల్లాలో అనేకం ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నేతలు ఏం చేసినా ఫర్వాలేదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. -
118 ట్రాక్టర్ల ఇసుక పోగులు సీజ్
లావేరు, న్యూస్‌లైన్ : మండలంలోని గుమడాం పంచాయతీలో ఇసుక అక్రమ నిల్వలపై మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గుమడాం గెడ్డలో ఇసుకను తరలించి పొలాల్లో నిల్వ చేసినట్లు మండల టాస్క్‌ఫోర్స్ కమిటీకి సమాచారం అందింది. దీంతో మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులైన తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, ఎస్సై రామారావు దాడులు చేపట్టారు. గుమడాం గ్రామానికి చెం దిన యాలాల గోవిందరావు, గొరుసుపూడి శ్రీనివాసరావు ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి గుమడాం పంచాయతీ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఆరు చోట్ల ఇసుక నిల్వలు వేశారు. వీటిని పరిశీలించిన అధికారులు స్వాధీ నం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను గుమడాం సర్పంచ్ దురగాసి భార్గవి, వీఆర్వో శ్రీనివాసరావుకు అప్పగించారు. ఈ ఇసుకను తరలించకుండా చూడాలని గుమడాం పంచాయతీ వీఆర్వో, వీఆర్ఏలను అధికారులు ఆదేశించారు. దాడుల్లో ఆర్ఐ సి.సన్యాసిరావు, వీఆర్ఓ శ్రీనివాసరావు, సర్పంచ్ ప్రతినిధి దురగాసి ధర్మారావు పాల్గొన్నారు. ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు సీజ్ చేసిన ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు తప్పవని మండల ఇసుక టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు జల్లేపల్లి రామారావు, ఎం.కిరణ్‌కుమార్, ఎస్సై రామారావు హెచ్చరించారు. గుమడాం పంచాయతీలో అనధికారికంగా నిల్వ వుంచిన 118 ట్రాక్టర్లు ఇసుకను సీజ్ చేసిన విషయాన్ని టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు, డుమా పిడి కల్యాణచక్రవర్తికి తెలిపారు. ఇసుకాసురుల గుండెల్లో గుబులు టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారుల దాడులు ఇసుకాసురుల గుండెల్లో గుబులు పట్టుకుంది. మండలంలోని గుమడాం, బుడతవలస, బుడుమూరు, రొంపివలస, తామాడ, నేతేరు, లక్ష్మిపురం, గురుగుబిల్లి, కొత్తకోట వద్ద గల గెడ్డల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇంతవరకూ అధికారులు పట్టించుకోకపోవడంతో మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లలా ఇసుక అక్రమ వ్యాపారం సాగింది. అధికారుల దాడులతో ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు పేర్కొన్నారు. -
జిల్లాలో అక్రమ ఇసుక దందా
సాక్షి, నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా సుమారు 15 చోట్ల ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం మంజీరా నదిలో బిచ్కుంద మండలం పుల్కల్, గుండెనెమ్లి, వా జీద్నగర్, బీర్కూర్ మండలంలో బీర్కూర్, బరంగెడి, కోటగిరి మండలం పోతంగల్లో అధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రెంజల్ మండలంలో పదుల సంఖ్యలో అనధికారిక క్వారీల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. బా ల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలుమండలాల పరిధిలో, పెద్దవాగులో కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. మామూళ్ల పర్వం.. ఇసుక దందాలో ‘రెవెన్యూ’ది కీలక పాత్ర. నదిలో ఇసుక తవ్వుకునేందుకు రెవెన్యూశాఖ ఇచ్చిన అనుమతుల మేరకే గనులశాఖ నుంచి పర్మిట్లు మంజూరవుతాయి. ఒక్కోసారి 1,500 నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారులు అనుమతిస్తారు. ఈ సమయంలో అధికారులు, క్షేత్ర సిబ్బంది స్థాయిని బట్టి మామూళ్లు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు నిబంధనలను నదిలో తొక్కి ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. చీకటి పడితే చాలు భారీ యంత్రాలను నదిలోకి దించి నదీ గర్భాన్ని తొలిచేసినా అటువైపు కన్నెత్తి చూడరు. అనుమతించిన సరిహద్దులను చెరిపేసి నదిలోకి తవ్వకాలు జరుగుతున్నా పట్టదు. చిన్నపాటి లోపాలకు వాహనదారుల వద్ద వేలల్లో జరిమానాలు వసూలు చేసే ఆర్టీఏ అధికారులకు అధికలోడుతో వెళుతున్న ఇసుక లారీలు కంటికి కూడా కనిపించవు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 టన్నుల ఇసుకతో పురాతన బ్రిడ్జిలపై నుంచి వెళుతున్నా.. వాటిని ఆపి జరిమానా విధించిన దాఖలాలు తక్కువే. అధిక లోడుతో వెళుతున్న ఈ వాహనాలు రహదారులను చిధ్రం చేస్తున్నా ఏమాత్రం పట్టింపు ఉండదు. ఒక్కో లారీకి.. ట్రిప్పుల వారీగా లెక్క చూసుకునే కొందరు ఆర్టీఏ అధికారులు వరుస పెట్టి చీమల దండులా వెళ్లే ఇసుక లారీల జోలికి అసలు వెళ్లరు. ఇసుక అక్రమ రవాణా పోలీసుల కనుసన్నల్లో సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లోని స్టేషన్లే కాకుండా, ఇసుక లారీలు వెళ్లే దారిలో ఉండే పోలీసుస్టేషన్లకు నెలవారీ మామూళ్లు ముట్టుతాయనే ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మామూళ్లు పుచ్చుకుంటున్న పొలీసు అధికారులే దగ్గరుండీ సెటిల్మెంట్లు చేస్తారని పలువరు పేర్కొంటున్నారు. కలెక్టర్ దృష్టిసారిస్తేనే అందరూ భాగస్వాములు కావడంతో ఇసుక అక్రమ దందాకు చెక్‌పెట్టే నాథుడే లేకుండా పోయాడు. తప్పిదారిన ఎవరైన ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళుతున్నా.. ఆ సమాచారం క్షణాల్లో ఆ క్వారీల నిర్వాహకులకు చేరిపోతోంది. దీంతో వారు ఎక్కడికక్కడ సర్దేస్తున్నారు. కలెక్టర్ ప్రద్యుమ్న, ఇటీవల బోధన్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరినారాయణన్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఈ ఇసుక అక్రమ రవాణాకు చెక్ పడే అవకాశాలున్నాయి. అర్ధరాత్రి ఆకస్మిక దాడులు చేస్తేనే అక్రమ తవ్వకాల బాగోతం వెలుగులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.