సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం మెట్టు దిగింది. గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనంపై వెనక్కి తగ్గింది. విలీనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన 14 పంచాయతీలకు నగారా మోగిం చిం ది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21న పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. శరవేగంగా సాగుతున్న నగరీకరణ నేపథ్యంలో రాజధాని పరిసరాల్లోని 36 పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీల తీర్మానాలను కోరింది. అయితే, గ్రేటర్‌లో విలీనానికి అనుకూలంగా కొన్ని గ్రామాలు తీర్మానాలు కూడా చేశాయి. మరికొన్ని తోసిపుచ్చాయి. గ్రామాల విలీనంపై జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, ప్రభుత్వం తన విశేషాధికారాలను వినియోగించి 15 గ్రామాలను విలీనం చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. అదే క్రమంలో కోర్టు కేసులు ఉన్న 14 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత చూపింది. తమ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టుకెక్కారు. దీంతో వీటికి అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు దృష్టికి తెచ్చింది. దీంతో ఈ పంచాయతీల పోరుకు లైన్‌క్లియరైంది. వీటికి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఈసీని కోరింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మళ్లీ పల్లెపోరుకు తెరలేచింది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా...
నామినేషన్ల స్వీకరణ : 6నుంచి 10వ తేదీవరకు
పరిశీలన : 11న
అప్పీల్ : 12న
అప్పీళ్ల పరిశీలన : 13న
నామినేషన్ల ఉపసంహరణ : 14న(3 గంటల్లోపు)
అభ్యర్థుల ప్రకటన : 14న(3 గంటల తర్వాత)
పోలింగ్ : 21న ( 7 గం॥నుంచి 1 వరకు)
ఓట్ల లెక్కింపు, ఫలితాలు : 21న ( 2గంటల నుంచి)
ఎన్నికలు జరిగే పంచాయతీలివే...
మేడ్చల్ : గుండ్లపోచంపల్లి
కుత్బుల్లాపూర్ : కొంపల్లి, ప్రగతినగర్, దూలపల్లి
కీసర : నాగారం, దమ్మాయిగూడ
ఘట్‌కేసర్ : చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్
రాజేంద్రనగర్ : మణికొండ జాగీర్,
కోకాపేట్, గండిపేట్,
మంచిరేవుల
శామీర్‌పేట్ : జవహర్‌నగర్
14 పంచాయతీలకు ఎన్నికలు
Published Tue, Sep 3 2013 12:41 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement