14 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు: మృణాళిని
హైదరాబాద్: గృహనిర్మాణాల అక్రమాలపై మొదటి దశ విచారణ పూర్తయిందని గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. మొత్తం 41లక్షల 609 ఇళ్లకు గానూ 14 లక్షల ఇళ్లనిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్టు తేలిందని మంత్రి చెప్పారు. రూ.4800 కోట్ల బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయన్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు.
రెవెన్యూ రికవరీ చట్టంతో నిధులు వెనక్కి రప్పించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సీఏల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి విచారణ చేపడుతామన్నారు. అంతేకాకుండా కొత్తగా 2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయన్నారు.