అలాగే, 2016-17లో రైతుల ఉత్పాదనలకు గిట్టుబాటు ధర లభించకపోవడానికి కారణాలు, పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధరలు లభించక రైతులకు వాటిల్లుతున్న నష్టాల నేపథ్యంలో మార్కెటింగ్ వ్యవస్థలను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతుందో వివరించాలంటూ అడిగిన ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మరోపక్క, దక్షిణ మధ్య రైల్వేకి క్లెరికేజ్ చార్జీల కింద వచ్చిన ఆదాయంపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సహాయమంత్రి రాజన్ గోహైన్ సమాధానం తెలిపారు.
2016-17లో రిజర్వడ్ టిక్కెట్ల కేన్సిలేషన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.103.27కోట్ల ఆదాయం లభించినట్లు వివరించారు. 2015-17లో రిజర్వడ్ టిక్కెట్ల ద్వారా రైల్వేలకు ఏటా లభించే ఆదాయం దాదాపు 25 శాతం పెరిగినట్లు ఆయన వివరించారు. ఇక టిక్కెట్ కేన్సిలేషన్ ద్వారా 2016-17లో దేశ వ్యాప్తంగా రైల్వేకు రూ.1400కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.