వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది | 2 committed suicide for unmarritual relationship | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది

Published Wed, Jun 3 2015 9:44 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది - Sakshi

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది

చేజర్ల (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి ఒక ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. వివాహేతర సంబంధం ఇద్దరి చావుకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... మాముడూరుకు చెందిన చీమలదిన్నె ప్రసాద్(32) తండ్రి నాలుగు నెలల క్రితం చనిపోయాడు. దీంతో అతని కుటుంబం నెల్లూరుకు మకాం మార్చింది. అక్కడే అంగడి గుమస్తాగా పనిచేస్తున్నాడు. భార్య, ఒక కుమారుడు కూడా ఉన్న ప్రసాద్.. పొదలకూరు మండలం ఇరువూరు ఎస్సీ కాలనీకి చెందిన యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ప్రసాద్ తనతో సంబంధం ఉన్న యువతితో కలసి మాముడూరు గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. బుధవారం రాత్రి మాముడూరుకు సమీపంలోని తోటలో వారు విగతజీవులై స్థానికులకు కనిపించారు. వారి పక్కన ఆహారం పొట్లాలు, పురుగు మందు డబ్బా కనిపించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement