విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయితోపాటు రూ. 37 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ క్రమంలో పోలీసుల నుంచి ఓ స్మగ్లరు నుంచి తప్పించుకుని పరారైయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.