ప్రైవేట్ ట్రావెల్స్పై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. అందులోభాగంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఓల్డ్ కర్నూలు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 20 బస్సులపై కేసు నమోదు చేశారు.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలోని ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.
దాంతో మహబూబ్నగర్ ఘటన జరిగిన నాటి నుంచి దాదాపు వెయ్యికి పైగా బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అయితే మహబూబ్నగర్ ఘటన మరువకు ముందే నిన్న బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో ఏడుగురు సజీవ దహనమైయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.