పాడేరు (విశాఖపట్టణం): అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరులో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. జి. మాడుగుల మండలానికి చెందిన డి. రాజు, కె.బాలు, వి. ప్రభాకర్లు గంజాయిని అక్రమంగా జీపు, ఆటోలో తరలిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి వారి వద్ద నుంచి 200 కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా రూ. 15 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.