మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులను తీసుకువెళ్తున్న బల్లకట్టులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఆ బల్లకట్టు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద కృష్ణా నదిలో గురువారం నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న దాదాపు 200 మంది భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బల్లకట్టుపై ప్రయాణిస్తున్న భక్తులలో మహిళలు, వృద్దులు, చిన్నారులు ఉన్నారు.
బల్లకట్టులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు బల్లకట్టు యజమానులు వెల్లడించారు. భక్తులంతా ముక్త్యాలలోని దేవాలయాన్ని దర్శించుకునేందుకు పయనమైయ్యారు. ఈ సందర్భంగా ఆ ఘటన చోటు చేసుకుంది.