నక్కపల్లి/ఎస్‌రాయవరం,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిం దని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలే అజెం డాగా ప్రజల పక్షాన పార్టీ నిలుస్తుందని వైఎ స్సార్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ అన్నారు. అడ్డురోడ్డులో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో గురువారం ఆయన సమావేశ మయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 22 నుంచి అన్ని అసెంబ్లీ ని యోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపడతామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్ర యోజనాల కోసం కాంగ్రెస్ ప్రత్యేక తెలంగా నం ఆలపిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచాలన్న డిమాండ్‌తోనే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పదవులకు రాజీనామా చేశారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రప్రభుత్వానికి, కాం గ్రెస్ అధిష్టానానికి ఇప్పటికీ ఒక స్పష్టత లేదన్నారు. వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ సలహా లు, సూచనలతోనే ఈ యాత్రలు చేపడుతున్నామన్నారు.
ఈనెల 19న విజయవాడలో విజయమ్మ నిరాహారదీక్షకు సంఘీభావంగా జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర సాగని నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 22న పాయకరావుపేట, 23న యలమంచిలి, 24న చోడవరం, 25న మాడుగుల, 26న నర్సీపట్నం, 27న పెందుర్తి, 28న అనకాపల్లి ప్రాంతాల్లో బస్సుయాత్రలు జరుగుతాయన్నారు.
పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు మాట్లాడుతూ బస్సుయాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభిస్తే భారీస్థాయిలో కార్యకర్తలు, అభిమానులతో విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, ఉత్తరాంధ్ర జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, పూడి మంగపతిరావు, పెట్ల ఉమాశంకర్‌గణేష్, నాయకులు పి.ఎస్.ఎన్.రాజు, వీసం రామకృష్ణ, బొలిశెట్టిగోవిందు, చిక్కాలరామారావు, జానకి శ్రీను, ధనిశెట్టిబాబూరావు పాల్గొన్నారు.
22 నుంచి సమైక్యాంధ్ర బస్సుయాత్రలు
Published Fri, Aug 16 2013 3:01 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement