కూకట్‌పల్లి (హైదరాబాద్) : ఈత సరదా ఆ చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లి ఎల్లమ్మబండ ప్రాంతంలోని సీజేఆర్ నగర్‌లో నీళ్లతో నిండిన ఓ క్వారీ గుంతలో ఈత కోసం దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. క్వారీ సమీపంలో వస్త్రాలు కనిపించడంతో స్థానికులు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను గుర్తించి, వెలికితీసే చర్యలు చేపట్టారు. మృతులు 12 నుంచి 14 ఏళ్లలోపు వారని సమాచారం.