విజయనగరం : భానుడి ప్రతాపానికి విజయనగరం జిల్లాలోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఆదివారం ఉదయం మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వెంకటమ్మ(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. కాగా శనివారం ఎండలో వ్యవసాయపనులకు వెళ్లి వచ్చిన ఆమె అస్వస్థతకు లోనైంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.
అదేవిధంగా పాచిపెంట మండలానికి చెందిన కార్పెంటర్ కందిపప్పు వీరన్న(70) శనివారం వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు లోనై ఆదివారం ఉదయం మృతి చెందాడు. అలాగే మెట్టవలసకు చెందిన మరో వ్యవసాయ కూలీ కె.లక్ష్మి(40) కూడా వడదెబ్బకు గురై ఆదివారం ప్రాణాలు విడిచింది.
భానుడి ప్రతాపానికి ముగ్గురు బలి
Published Sun, May 24 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement