పెద్దతిప్పసముద్రం: చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పి.సదుం గ్రామం వద్ద పాపాగ్ని నది వరదలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దాదాపు 30 మంది పి.సదుం గ్రామ సమీపంలోనే ఉన్న వ్యాసరాయ సముద్రం చెరువు వద్ద బొగ్గుబట్టీలు ఏర్పాటు చేసుకున్నారు. పాపాగ్ని నది వరద ఉధృతంగా రావటంతో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెరువులోకి నీటి రాక మొదలైంది. చెరువు నిండి అక్కడే బొగ్గుబట్టీలను వరద కమ్మేసింది. దీంతో బట్టీ కార్మికులు వరద నీటిలో చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునికూలీలను రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
వరద నీటిలో 30 మంది కూలీలు
Published Tue, Nov 24 2015 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement