struck
-
లంక గ్రామాల ప్రజలకు అండగా సీఎం జగన్
-
సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు
గ్యాంగ్టాక్: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టాక్ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్టాక్ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు. -
‘బిడ్డా.. ఎట్లున్నావ్.. ఎక్కడుంటున్నావ్’
హుడాకాంప్లెక్స్:‘బిడ్డా.. ఎట్లున్నావ్.. ఎక్కడుంటున్నావ్.. భయపడొద్దు.. మీకేంకాదు’ అని ఉక్రెయిన్‌లో ఉంటున్న తమ బిడ్డలను తల్లిదండ్రులు గంటకోసారి వీడియో కాల్ చేస్తూ ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కునుకులే ని రాత్రులు గడుపుతున్నారు. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళన వారిని పట్టి పీడిస్తోంది. సరూర్‌నగర్ డివిజన్ మణిపురి కాలనీకి చెందిన దివ్య, మేఘన, అల్కాపురికి చెందిన తేజస్వి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.రోజురోజుకీ యుద్ధం తీవ్రత పెరుగుతుండటంతో అటు పిల్లలు,ఇటు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. గంటకోసారి వీడియో కాల్చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పిల్లలకు ధైర్యం చెబుతున్నారు. రెండు రోజులుగా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ పిల్లలు హాస్టల్లో కాకుండా మెట్రోస్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారని, ప్రాణా లను సైతం అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తినడానికి తిండి లేకుండా ఆందోళన చెందుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమ పిల్లలతో పాటు భారతీయ విద్యార్థులను కాపాడాలని స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. క్షేమంగా తీసుకురావాలి యుద్ధం మొదలైనప్పటి నుంచి మాలో ఆందోళన మొదలైంది. బాంబుల శబ్దాలకు పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ ధైర్యం కోల్పోతున్నారు. మా పాపను ఏ విధంగానైనా సరే రప్పించాలి. నిన్న ఉన్న ధైర్యం ఈ రోజు లేదని వీడియోకాల్ చేస్తుంటే చూస్తున్నాం. ట్విట్టర్లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. – రాజుబాయి, మణిపురికాలనీ ప్రభుత్వమే దిక్కు వైద్య విద్యనభ్యసించడానికి రెండేళ్ల క్రితం నా బిడ్డ మేఘన ఉక్రెయిన్ దేశానికి వెళ్లింది. యుద్ధంతో తిండీ తిప్పలు లేక భరించలేకపోతోంది. ప్రభుత్వమే మా పిల్లలను రప్పించి మాకు అప్పగించాలి. – నాగజ్యోతి త్వరగా రప్పించాలి కన్సల్టెన్సీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా పాపతో పాటు 29 మంది విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రప్పించాలి. ప్రభుత్వమే స్పందించాలి. – వేణు -
రైతు వంతెన వద్ద ఇరుక్కుపోయిన భారీ కంటెయినర్ : ముంబై
-
వరదల్లో చిక్కుకున్న 30 ట్రాక్టర్లు : వైఎస్సార్ జిల్లా
-
రైలు క్రింద చిక్కుకున్న వృద్దుడు : ముంబై
-
ఎరక్కపోయి ఇరుక్కుని!
అనగనగా ఒక ఎలుక. ఎలుకంటే ఎలుకలా ఉండదు. బాగా బలిసిన పందికొక్కులా కనిపిస్తుంది. చలికాలం వస్తే చాలు ఇలాంటి జంతువులన్నీ కొవ్వెక్కి బాగా లావెక్కిపోతాయి. జర్మనీలోని బెన్షీమ్ పట్టణం దాని నివాసం. ఓ రోజు బాగా తిన్న ఆ ఎలుక కాసేపు వాకింగ్‌కు బయల్దేరింది. రోడ్డు మీద ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు కన్నంలో ఎరక్కపోయి ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక.. మ్యాన్హోల్లోకి దిగలేక అవస్థలు పడింది. ఎటూ కదల్లేక అరవసాగింది. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న స్థానికుడైన నాట్, అతని భార్య జూలియానాలు.. ఆ ఎలుక పడుతున్న అవస్థలు చూసి ఆగారు.. ఆ ఎలుకను నెమ్మదిగా పైకి లాగడానికి జూలియానా ప్రయత్నించింది. అసలే ఇరుక్కుపోయిన బాధలో ఉన్న ఆ ఎలుక గట్టిగా అరుస్తూ ఆమె చేతికున్న లెదర్ గ్లౌజులను కొరికేసిందట. ఇక లాభం లేదనుకుని ఎలుకల్ని పట్టే నిపుణులకు వాళ్లు ఫోన్ చేశారు. అగ్నిమాపక దళ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆ ఎలుకను రక్షించేందుకు ఏకంగా 9 మంది అధికారులు వచ్చారు. జంతువుల్ని కాపాడే నిపుణుడు షేర్ కూడా వారికి సాయం చేశారు. తమ దగ్గరున్న పరికరాల సాయంతో ఎలుకను గట్టిగా కిందకి నెట్టారు. ఆ మూత నుంచి బయటపడిన ఎలుక.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. మమూలుగా అయితే ఇలాంటి రక్షణ చర్యలకు అగ్నిమాపక సిబ్బంది 120 జర్మనీ యూరోల డబ్బు వసూలు చేస్తారు. కానీ ఆ ఎలుక ఎవరికీ చెందదు కాబట్టి జంతు ప్రేమతోనే ఉచితంగానే కాపాడారు. నాట్ ఇద్దరు కుమార్తెలు మ్యాన్‌హోల్‌ను తవ్వి ఈ ఎలుకను పట్టే ప్రక్రియ అంతా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి వైరల్‌గా మారాయి. -
ఆమెను పొడిచాడు... కాని తప్పించుకున్నాడు...
ఫొటోలో కనిపిస్తున్నది 23 ఏళ్ల ఖాదిజా సిద్దిఖీ. పాకిస్తాన్లో ఇప్పుడు ఈ అమ్మాయి వార్తల్లో ఉంది.ఆమెకు న్యాయం అందుతుందా లేదా అని దేశం అంతా ఎదురు చూస్తూ ఉంది. సాక్షాత్తూ ఆ దేశ సుప్రీం కోర్టే రంగంలో దిగి మరీ కేసును పరిశీలిస్తోంది. ఇంతకూ ఏమైంది? 23 కత్తిపోట్లు 2016. మే 3. లా స్టూడెంట్ అయిన ఖాదిజా తన కారు డ్రైవర్‌తో కలిసి లాహోర్‌లోని సిమ్లాహిల్ ప్రాంతంలోని స్కూల్ నుంచి తన చెల్లెలిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లింది. చెల్లెలిని తీసుకుని కారులో కూచుంటూ ఉండగా హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి వచ్చి ఆమె మీద విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. వెన్ను మీద 23సార్లు పొడిచి పారిపోయాడు. ఇది తన క్లాస్మేట్ షా హుసేన్ పనే అని ఖాదిజా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఈ విషయాన్ని నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇది చాలదని ఖాదిజా భావించి సెషన్స్ కోర్టుకు వెళ్లింది. అసలు ఈ పని చేసింది తాను కాదని షా హుసేన్ కూడా సెషన్ కోర్టుకు వెళ్లాడు. సెషన్ కోర్టు అతడికి కొన్ని పెనాల్టీలు విధించి శిక్షను ఐదేళ్లకు తగ్గించింది. అది కూడా అన్యాయమే అని షా హుసేన్ లాహోర్ హైకోర్టుకు అప్పీల్ చేశాడు. జైలు నుంచే న్యాయం కోసం పోరాడాడు. కేసును పరిశీలించిన హైకోర్టు షా హుసేన్ నిర్దోషి అని గత వారం తీర్పు ఇచ్చింది. ఈ విషయమై ఆ దేశపు సోషల్ మీడియాలో పెద్ద గగ్గోలు రేగింది. వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని ఆ దేశపు చీఫ్ జస్టిస్ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఆదేశించారు. ఇప్పుడు తిరిగి కేసు తెరవాలా వద్దా అనేది తేలనుంది. కేసు ఎందుకు కొట్టేశారు.... ‘పెళ్లి చేసుకోమని కోరాడు. నేను నిరాకరించడం వల్లే దాడి’ అనేది ఈ దాడి తర్వాత ఖాదిజా చేసిన అభియోగం. అయితే ప్రాసిక్యూషన్గాని, ఇన్వెస్టిగేషన్ అధికారులుగాని దాడిని నిర్ధారణ చేసే విషయాలను బలంగా కోర్టు ముందుకు తెచ్చే ప్రయత్నం చేయలేదు. ‘పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను’ అని ఖాదిజా ఇచ్చినట్టుగా చెబుతున్న ఒక ఉత్తరాన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అది ఆమె ఇచ్చినదో కాదో ఒకవేళ ఇచ్చి ఉంటే ఏ పరిస్థితుల్లో ఇచ్చిందో తేల్చలేదు. నిందితుడి ఒంటి మీద రక్తపు మరకలు గానీ హెల్మెట్ మీద మరకలు కాని ఫోరెన్సిక్ ద్వారా తేల్చే ప్రయత్నం చేయలేదు. ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఒక పార్కులో దాడికి కారణమైన కత్తి దొరికింది. దాని మీద ఒక్క చుక్క రక్తం లేదు. నిందితుడు హెల్మెట్‌లో ఉండటం వల్ల అది షా హుసేనే కావలసిన అవసరం లేదని డిఫెన్స్ వాదించింది. కాలేజీలో అతని మీద దాడి ముందు వరకు ఆమె ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం కూడా డిఫెన్స్‌కు లాభించింది. అన్నింటి కంటే ముఖ్యం షా హుసేన్ తండ్రి పేరు మోసిన లాయరు కావడం అతడు తన కుమారుడి తరఫున డిఫెన్స్ అంతా పకడ్బందీగా ఉండేలా చూసుకోవడం కూడా కేసు కొట్టివేతకు ఒక కారణం కావచ్చు. ఎంతో ధైర్యస్తురాలు ఖాదిజా ఎంతో ధైర్యస్తురాలు. తన మీద అంత పెద్ద దాడి జరిగినా ధైర్యంగా తనను తాను కూడగట్టుకోగలిగింది. స్వస్థత పొందగలిగింది. అంతే కాదు అప్పట్లో రాయకుండా వదిలిపెట్టిన పరీక్షలను ఇప్పుడు రాసి తన చదువును ముగించబోతోంది. న్యాయం కోసం పోరాడుతాను అని ఆమె అంటోంది. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తోంది. న్యాయస్థానంలో ఆమెకు దొరకబోయే న్యాయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఆమె భారీ స్థాయి స్పందన వచ్చి నిందితునికి సోషల్ మీడియానే పెద్ద శిక్ష వేసినంత పని చేసింది. షా హుసేన్‌ను నిరసిస్తూ ఖాదిజాకు మద్దతిస్తూ ఎందరో పోస్టింగులు పెట్టారు. -
గో-కార్ట్ రేస్.. ఊహించని ప్రమాదం
సాక్షి, ఛండీగఢ్ : సరదాగా బయట గడిపేందుకు వెళ్లిన ఈ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గో-కార్ట్ రేసులో ఊహించని రీతిలో ప్రమాదం జరగటంతో 28 ఏళ్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భయానక ప్రమాదంతో అమ్యూజ్మెంట్ పార్క్‌లో హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. వివరాల్లోకి వెళ్లితే... పంజాబ్‌కు చెందిన రామ్‌పుర ఫూల్‌లోని బత్తిండకు చెందిన పునీత్, తన భర్త అమర్దీప్ సింగ్, రెండేళ్ల కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం పింజోరేలోని యాదవీంద్ర గార్డెన్స్‌కు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాక అంతా గో-కార్ట్ రేసుకు సిద్ధమయ్యారు. భర్త ఆమె ఓ కారులో కూర్చోని ముందుకు వెళ్లారు. మొదటి లాప్ పూర్తయ్యాక ఒక్కసారిగా పునీత్ జుట్టు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. వేగం ఎక్కువగా ఉండటంతో భర్త వాహనాన్ని నియంత్రించలేకపోవటంతో ఒక్కసారిగా ఆమె జుట్టుతోపాటు తల పైభాగం కాస్త ఊడిపోయి చట్రంలోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా హహకారాలు చేస్తూ పరుగులు తీశారు. వెంటనే నిర్వాహకులు కొందరు వాహనాన్ని అదుపు చేసి.. స్పృహ కోల్పోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఊహించని ఈ దుర్ఘటనతో పునీత్ కుటుంబంలో విషాదం నెలకొంది. -
ముంబైలో కుండపోత
-
ముంబైలో కుండపోత
183 విమానాలు రద్దు, 51 విమానాల దారి మళ్లింపు ముంబై/హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు దక్షిణ ముంబై, బోరివలీ, కాందివలీ, అంధేరీ, భందూప్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. భారీవర్షాల ప్రభావంతో దాదాపు 183 విమానాలు రద్దు కాగా, 51 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు. వారణాసి నుంచి 183 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశించింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు 303.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు శాంతాక్రుజ్‌లోని భారత వాతావరణ విభాగానికి చెందిన అబ్జర్వేటరీ తెలిపింది. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా పాల్ఘర్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మన్మాడ్–ముంబై ఎక్స్‌ప్రెస్, గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్, బాంద్రా టెర్మినస్ సూరత్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. మరోవైపు వరద ప్రభావంతో చాలా సబర్బన్ రైళ్లు రద్దు కావడంతో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు డబ్బావాలాలు ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలో... భారీ వర్షాలతో ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేయడంతో అధికారులు 16 దేశీయ, అంతర్జాతీయ విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పదహారు విమానాల్లో వచ్చిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో, నోవాటెల్, తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. నిలిచిపోయిన విమానాలు: జూరిచ్–ముంబై (ఎల్ఎక్స్ 154, కౌలాలంపూర్–ముంబై (ఎంహెచ్ 194), లండన్–ముంబై (9డబ్ల్యూ 119), ఆమ్స్టర్డ్యామ్–ముంబై (9 డబ్ల్యూ 231), బెంగళూరు–ముంబై (ఏఐ610), కొచ్చి–ముంబై (9 డబ్ల్యూ 404), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 376), బెంగళూరు –ముంబై (9డబ్ల్యూ442), రాజ్‌కోట్–ముంబై (ఏఐ 656), ఢిల్లీ–ముంబై (ఏఐ 191), టొరంటో–ముంబై (ఏసీ 046), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 354), జైపూర్–ముంబై (9డబ్ల్యూ 2054), హైదరాబాద్–పుణే–ముంబై (9 డబ్ల్యూ 2574), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 628), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 616). -
నది అందాలను చూడాలని వెళ్లి..అంతలోనే..
-
లిఫ్ట్‌లో ఇరుక్కొని పదేళ్ల చిన్నారి మృతి
-
చంద్రబాబు కాన్వాయ్ వస్తుందంటే చాలు..
-
వైఎస్సార్ జిల్లాలో చిన్నారికి తప్పిన పెను ప్రమాదం
-
వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు
-
భారీ వర్షంతో అతలాకుతలం
మిర్యాలగూడ : భారీ వర్షం మిర్యాలగూడ నియోజకవర్గంలో అతలాకుతలమైంది. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారే వరకు వర్షం కురిసింది. దాంతో చెరువులు పూర్తిగా నిండాయి. మిర్యాలగూడ పెద్ద చెరువులో చుక్క నీరు లేకుండా ఉండగా ఒక్క రాత్రికే చెరువు నిండింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హనుమాన్‌పేట, రెడ్డికాలనీ, ముత్తిరెడ్డి కుంట, బంగారుగడ్డ, హౌజింగ్‌బోర్డు కాలనీలలో భారీగా వర్షపు నీరు నిలిచింది. దాంతో పాటు గాంధీ పార్కు పాఠశాలలో భారీగా వర్షపునీరు చేరింది. దాంతో ప్రజలు రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హనుమాన్‌పేటలో ఉన్న గుడిసె వాసులు ఇండ్లలోకి నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం భారీ వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్లకు వెళ్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తడకమళ్ల సమీపంలోని కల్వర్టుల మీదుగా నీరు ప్రవహిస్తుండం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి పాఠశాలలో వర్షపు నీరు చేరి చెరువును తలపించేలా ఉంది. అధికారుల పట్టింపు లేకనే నష్టం పట్టణంలోని హనుమాన్‌పేటలోని సీఐటీయూ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న గుడిసెల్లోకి వర్షపు నీరు చేరడంతో సామగ్రి పూర్తిగా తడిసిపోయిందని వార్డు కౌన్సిలర్ బావండ్ల పాండు పేర్కొన్నారు. సోమవారం హునుమాన్‌పేటలోని నీటమునిగిన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ గతంలో కూడా ఎన్నో పర్యాయాలు రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చెప్పినా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడం వల్లనే గుడిసెల్లోకి నీరు చేరిందన్నారు. ఆయన వెంట సైదులు, తిరుపతయ్య, సంగయ్య, జయమ్మ, రాంబాబు, మహేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు పరణిపుత్తూర్లోని వృద్ధులకు, చెన్నైలో ఇరుక్కుపోయిన తెలుగువారి కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పరణిపుత్తూర్ వృద్ధాశ్రమం సగం వరకు మునిగిపోవడంతో 700 మంది వృద్ధుల ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు సమాచారం. గత వారం రోజుల్లో వరదల్లో 22 మంది మృతిచెందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 60 మంది ఉద్యోగులు చెన్నై వరదల్లో చిక్కుకున్నారు. గిండి ప్రాంతంలోని సెంట్రల్ ట్రైనింగ్ స్టేషన్లో వరద నీటిలో ఏపీ ఉద్యోగులు చిక్కుకున్నారు. చెన్నై ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న తిరుపతి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.విద్యార్థుల సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు
-
వరద నీటిలో 30 మంది కూలీలు
పెద్దతిప్పసముద్రం: చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పి.సదుం గ్రామం వద్ద పాపాగ్ని నది వరదలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దాదాపు 30 మంది పి.సదుం గ్రామ సమీపంలోనే ఉన్న వ్యాసరాయ సముద్రం చెరువు వద్ద బొగ్గుబట్టీలు ఏర్పాటు చేసుకున్నారు. పాపాగ్ని నది వరద ఉధృతంగా రావటంతో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెరువులోకి నీటి రాక మొదలైంది. చెరువు నిండి అక్కడే బొగ్గుబట్టీలను వరద కమ్మేసింది. దీంతో బట్టీ కార్మికులు వరద నీటిలో చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునికూలీలను రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. -
వాగులో చిక్కుకున్న యువకుడు
-
వాగులో చిక్కుకున్న యువకుడు
కృష్ణా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరువాగు పొంగి పొర్లుతోంది. దీంతో పొలం పనులకు వెళ్లి వస్తూ యేసునాథ్ అనే యువకుడు మున్నేరువాగులో చిక్కుకున్నాడు. పెనుగంచి ప్రోలు మండలం శెనగపాడు వద్ద వాగులో అతడు చిక్కిపోయాడు. దీంతో స్థానికులు అతడికి ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోటును పంపి యేసునాథ్ను కాపాడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమైతే యేసునాథ్ ఉండే ప్రాంతం వరదతో నిండిపోయే ప్రమాదం ఉంది. -
ఎవరెస్ట్‌పై చిక్కుకున్న తెలుగువారు
-
విహారానికి వెళ్లి విధ్వంసంలో చిక్కుకున్నారు
-
ఉజ్బెకిస్తాన్‌లో చిక్కుకున్న 250 మంది భారతీయులు
-
ఇరాక్‌లో చిక్కుకున్న 40మంది విశాఖవాసులు