300 బస్తాల రేషన్ బియ్యం | 300 bags of ration rice Siege | Sakshi
Sakshi News home page

300 బస్తాల రేషన్ బియ్యం

Published Thu, Nov 21 2013 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

300 bags of ration rice Siege

పీసీపల్లి, న్యూస్‌లైన్ :   ఓ గోడౌన్లో ఉన్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని తలకొండపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఓ అజ్ఞాత వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ మౌలా సాహేబ్, ఎఫ్‌ఐ జయశ్రీలు ఆ గోడౌన్‌పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో అక్రమంగా పలు రేషన్ దుకాణాల వద్ద సేకరించిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. డీలర్ పరారీలో ఉండటంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు.  ఈ డీలర్ అక్రమాలపై నాలుగు రోజుల క్రితం సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది. అప్రమత్తమై 300 బస్తాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండగా అధికారులు పట్టుకున్నారు. ప్రజాప్రతినిధులతో హెచ్చరికలు జారీ చేయించడంతో గోడౌన్ సీజ్ చేసేందుకు అధికారులు ఒకదశలో వెనకడుగు వేశారు. స్థానికులు వాగ్వాదానికి దిగడంతో సీజ్ చేయక తప్పలేదు.
 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
 మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని నంద్యాలకు తరలిస్తుండగా రైల్వేస్టేషన్‌లో రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఏఎస్‌ఓ ఆర్.కోటయ్య కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన సుమారు పదిమంది మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 15 క్వింటాళ్ల బియ్యాన్ని రైల్వేస్టేషన్ లో ఉంచి నంద్యాలకు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అధికారులు రైల్వేస్టేషన్‌కు చేరుకుని బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితుల్లో కొందరు పరారీకాగా నంద్యాలకు చెందిన కాళంగి సరస్వతి, సరోజలను అదుపులోకి తీసున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు కోటయ్య తెలిపారు. దాడుల్లో మార్కాపురం, వైపాలెం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు ఎ.వేణుగోపాలరావు, జి.హరనాథ్‌బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement