ఆర్టీసీ బస్సు, కారు ఢీ: నలుగురికి గాయాలు | 4 injured in bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, కారు ఢీ: నలుగురికి గాయాలు

Published Thu, Feb 11 2016 10:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

4 injured in bus accident

చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పసర్లపల్లి వద్ద హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు. కారులో చింతపల్లి నుంచి మాచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement