
సీహెచ్.పోతేపల్లిలోని పీహెచ్‌సీలో 4.2 కిలోలతో జన్మించిన శిశువు
పశ్చిమగోదావరి,ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్.పోతేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఒక మహిళ 4.2 కిలోల బరువైన మగ శిశువుకు జన్మనిచ్చింది. గుండుగొలనుకుంటకు చెందిన కొలుకులూరి అంజలి పురిటినొప్పులతో బాధపడుతుండగా ఆమె భర్త నాగేశ్వరరావు సీహెచ్.పోతేపల్లిలోని పీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు కె.విజయ్‌కుమార్‌రాజ, వైద్య సిబ్బంది శ్రమించి ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె 4.2 కిలోల బరువుతో మగ శిశువుకు జన్మనిచ్చినట్టు వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment