గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల గడువు తేదీ ముగిసిందో లేదో... అప్పుడే పైరవీలు షురూ అయ్యాయి. కేవలం 29 పో స్టులకు ఊహించనంతగా 5,808మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో పోటీ తీవ్రస్థాయిలో పెరిగింది.
ఇందూరు, న్యూస్‌లైన్:
గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల గడువు తేదీ ముగిసిందో లేదో... అప్పుడే పైరవీలు షురూ అయ్యాయి. కేవలం 29 పో స్టులకు ఊహించనంతగా 5,808మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో పోటీ తీవ్రస్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో పైరవీకారులు రంగంలోకి దిగారు. కొంతమంది అభ్యర్థులు ఎం తైనా ఇచ్చేందుకు ముం దుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వారి బలహీనతను సొమ్ము చేసుకునేం దుకు ఓ ఉద్యోగ సంఘం నేత తనకు సంబంధిత శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారితో సంబంధం ఉందంటూ ప్రచారం చేసుకుంటూ, ఉద్యో గం ఖాయమంటూ అభ్యర్థులతో బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం.
కార్యాలయంలోనూ
మరోవైపు జిల్లా పంచాయతీ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఒకరు అధికార పార్టీకి చెందిన నేతతో పోస్టుల భర్తీలో పైరవీలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతకు కూడా సదరు రాష్ట్ర స్థాయి అధికారితో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఉద్యోగి ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారేకాకుండా.. కాంట్రాక్టు కార్యదర్శులు కూడా ఈ పైరవీకారులను ఆశ్ర యిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పని చేసే కాంట్రాక్టు కార్యదర్శులకు ప్రభుత్వం 25 శాతం వెయిటేజీ మార్కులను కల్పించింది. మొత్తం 29 పోస్టుల్లో 20 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శులకే వస్తాయని అంచనాలు ఉన్నప్పటికీ.. ఒక వేళ రాకపోతే చాలా బాధ పడాల్సి వస్తుందని కొందరు ముడుపులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వారు పంచాయతీ శాఖలో పనిచేసే సదరు ఉద్యోగినే సంప్రదించినట్లు సమాచారం. ఉద్యోగ సంఘ నాయకుడు, పంచాయతీ శాఖ ఉద్యోగియే కాకుండా వివిధ పార్టీలకు చెందిన చోటా మోటా నేతలు కూడా అమాయక అభ్యర్థులను మభ్య పెడుతూ డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్తువె త్తుతున్నాయి.
పైరవీలకు ఆస్కారం లేదు...
-సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి
గ్రామ కార్యదర్శి పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేస్తాం. అభ్యర్థుల్లో డిగ్రీ మార్కులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వారికే ఉద్యోగాలు లభిస్తాయి. ఎవరు కూడా పైరవీల కారులను ఆశ్రయించి మోసపోవద్దు. దరఖాస్తులు చేసుకున్న అందరి అభ్యర్థుల మార్కుల వివరాలు నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తాం. ఎలాంటి అనుమానాలు చెందద్దు.