
అనంతలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పలు దుకాణాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి... వారిపై కేసు నమోదు చేశారు.
స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పలు దుకాణదారులు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు.