విశాఖపట్నం: పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ జంక్షన్ సమీపంలో జరిగింది.
వివరాల ప్రకారం.. రోలుగుంట మండలం నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాటు వేసిన పోలీసులు, బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 27బస్తాల్లో సుమారు 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రత్నంపేట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాతో సంబంధమున్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 27 లక్షలని పోలీసులు చెప్పారు.
540 కేజీల గంజాయి పట్టివేత
Published Sat, Apr 4 2015 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement