హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల సమ్మె పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని రెవిన్యూ ఉద్యోగుల తరపు న్యాయవాదా రామచంద్రరాజు అన్నారు. ఏపీ ఎన్జోవోల సమ్మె ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన తెలిపారు.
ఏపీ ఎన్జీవోలు మొదట భారత పౌరులని, ఆ తర్వాతే ఉద్యోగులని తెలిపారు. పౌరులుగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వాళ్లు సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరు లక్షల మంది ఏపీ ఎన్జోవోల ఉద్యమానికి ఆరు కోట్ల మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.