కర్నూలు (గడివాముల) : అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో.. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నవారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివాముల మండలం తిరుపాడు సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వేల్పనూరు గ్రామానికి చెందిన షబ్బీర్ తన కొడుకూ, కూతురుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి గోరుకల్లులోని దర్గాకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ తిరుపాడు కొరుటమద్ది మధ్యకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో షఫివుల్లా(34) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ బోల్తా : 8మందికి గాయాలు
Published Thu, Jul 30 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement