Tractor over turns
-
ట్రాక్టర్ బోల్తా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 25వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి. సుహొసినిగా గుర్తించారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దొరవారిసత్రం: మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్ మావిళ్లపాటి రాజయ్య(40) మృతి చెందిన సంఘటన తిమ్మినాయుడు కండ్రిగ గ్రామ రోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... తనియాలి ఎస్సీ కాలనీకి చెందిన రాజయ్య బూదూరు గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద ట్రాక్టర్లో మట్టి లోడు చేసుకుని తిరిగి తనియాలి గ్రామానికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ తిమ్మనాయుడుకండ్రిగ గ్రామ రోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలాల్లో పడిపోవడంతో డ్రైవర్ కూడా ట్రాక్టర్ కిందనే పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటకు తరలిస్తున్న సమయంలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఏలాంటి సమాచారం అందలేదు. -
ట్రాక్టర్ బోల్తా : 8మందికి గాయాలు
కర్నూలు (గడివాముల) : అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో.. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నవారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివాముల మండలం తిరుపాడు సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వేల్పనూరు గ్రామానికి చెందిన షబ్బీర్ తన కొడుకూ, కూతురుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి గోరుకల్లులోని దర్గాకు ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ తిరుపాడు కొరుటమద్ది మధ్యకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో షఫివుల్లా(34) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో నంద్యాల ఆస్పత్రికి తరలించారు.