హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 8 మంది దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం అబ్బరాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. వారిద్దరూ బైకుపై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ మలక్‌పేట వద్ద మెట్రో పనుల కోసం తీసిన గుంటలో సిమెంట్ లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. హయత్‌నగర్ పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన రోడ్డప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద సమీపంలో లారీ - కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
ట్రాక్టర్ ఢీకొని తండ్రీకూతురు దుర్మరణం
Published Thu, Apr 17 2014 8:31 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement