కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి సమీపంలోని రహదారిపై పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.