సాక్షి, చెన్నై: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల(బి.టెక్) ప్రవేశ నిమిత్తం ఈ నెల 19 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ-2015 ఆరంభం కానుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్సిటీ అధ్యక్షుడు పి.సత్యనారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా దేశం నలుమూలల నుంచి ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈఈ) రాయడానికి 1,74,471 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
గత ఏడాదికంటే 40 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో రోజుకు రెండు సెషన్స్ చొప్పున దేశ వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పేపర్ పెన్సిల్ మోడ్(రాత) పరీక్ష ఈ నెల 26న ఉదయం 10గం నుంచి 12:30గం వరకు 102 కేంద్రాల్లో నిర్వహించనున్నామని వెల్లడించారు. పరీక్ష ఫలితాలు మే 4న ప్రకటిస్తామన్నారు.
కాగా, ఎంటెక్(ఎస్‌ఆర్‌ఎం జీఈఈటీ) ఎంబీఏ(ఎస్‌ఆర్‌ఎం సీఏటీ) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మే 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.వర్సిటీ వీసీ ప్రవీన్ బక్షీ, రిజిస్ట్రార్ సేతురామన్, అడ్మిషన్స్ డెరైక్టర్ ఆర్.ముత్తు సుబ్రమణియన్, రీసెర్చ్ డెరైక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.
19 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ పరీక్షలు
Published Tue, Apr 14 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement