అభం శుభం ఎరుగని తొమ్మిదేళ్ల బాలుడు విశాఖపట్నంలో కిడ్నాప్ అయ్యాడు. దామోదర్ అనే ఈ బాలుడిని కిడ్నాప్ చేసినవాళ్లు తల్లిదండ్రులను రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని చింతల అగ్రహారం గవరకాలనీకి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారి కొడుకు దామోదర్.. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మేడ మీద నుంచి కిందకు దిగి వెళ్లాడు. తర్వాత ఎంతకీ పైకి రాకపోవడంతో పిల్లాడు కనిపించడం లేదని పోలీసులకు పెందుర్తి పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే.. ఆ తర్వాత తండ్రి ఫోన్కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రూ. 30 లక్షలు ఇస్తేనే పిల్లాడిని విడిచిపెడతానంటూ డిమాండ్ చేశాడు. దాంతో పోలీసులు ఈ కేసును కిడ్నాప్ కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. దామోదర్ తండ్రి తనకు వచ్చిన ఫోన్ కాల్ను రికార్డు చేయడంతో.. ఆ కాల్ ఎక్కడినుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. తండ్రిది ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఆర్థిక లావాదేవీలు, తగాదాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లలో తీర్చాల్సిన వాళ్లు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోననే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి కిడ్నాప్.. 30 లక్షల డిమాండ్
Published Thu, Sep 11 2014 10:20 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
Advertisement
Advertisement