భీమవరం : స్వచ్ఛ భారత్, బాలికల రక్షణ, భ్రూణ హత్యల నివారణ, పర్యావరణ పరిరక్షణ, టైజంపై ఉక్కుపాదం నిలపాలంటూ ఐదు నినాదాలతో హస్తముద్రికలతో తలపెట్టిన జాతీయ పతాకం రూపకల్పన పూర్తయింది. సమాజానికి సందేశాన్ని ఇస్తూ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఐటీ విభాగంలో ఈ కార్యక్రమానికి నెలరోజుల క్రితం శ్రీకారం చుట్టారు. పట్టణంలో వివిధ కళాశాల, పాఠశాల విద్యార్థులతో ఐదు సందేశాలతో కూడిన హస్త ముద్రలను వేయించారు.
ఇలా 90/60 అడుగుల జెండా రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో జెండాను ప్రదర్శించి విద్యార్థులు ప్లాష్‌మాబ్ నిర్వహించారు. ఐటీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ జి.పార్థసారథివర్మ మాట్లాడుతూ 12,800 మంది విద్యార్థులు, యువకులు హస్తముద్రలు వేసి సంఘీభావం తెలిపారన్నారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు మాట్లాడారు. ఆంధ్రా యూనివర్సిటీ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఎం.శశి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రంగరాజు, డాక్టర్ హేమలత, ప్రొఫెసర్ కె.కిషోర్‌రాజు, హెచ్‌వోడీలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
సమైక్యతకు చిహ్నం.. హస్త ముద్రిత పతాకం
Published Sun, Feb 22 2015 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement