వైఎస్సార్ జిల్లా(ఎర్రగుంట్ల): మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) కాలనీకి చెందిన ఏడు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. ఇళ్లకు తాళాలు వేసుకుని సదరు ఉద్యోగులు ఊరికి వెళ్లారు. ఈ ఉదయం స్థానికులు గమనించి ఉద్యోగుల ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం తెలిపారు. ఒక ఇంట్లో 20 తులాల బంగారం, రూ.15 వేల నగదు చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 20 రోజుల క్రితం ఇదే మండలంలోని జువారి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఇదేవిధంగా 7 ఇళ్లలో చోరీ చేసి 80 తులాలు పట్లుకెళ్లారు. దానికి ఈ సంఘటనకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమోనని పలువురు అనుమానిస్తున్నారు.