ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెన్నానది సమీపంలో గల రెండు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నది ఒడ్డున ఉన్న వినాయక ఆలయం, శ్రీకృష్ణుడి ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఆలయాల్లోని హుండీలను ధ్వంసం చేసి విలువైన సొత్తును అపహరించుకు పోయారు. ఉదయం గుడిలో పూజలు నిర్వహించడానికి వచ్చిన అర్చకులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక దర్యాప్తు చేస్తున్నారు.