
ఉద్యోగుల కేటాయింపు వివాదంపై 28న కీలక సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు వివాదాలపై ఈ నెల 28న ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమలనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల విభజనకు శాశ్వత మార్గదర్శకాలపై చర్చిస్తారు.
ఈ సమావేశం తర్వాతే ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటిదశలో సుమారు 20 వేల మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేందుకు వర్క్ టు సర్వ్ ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని వివిధ శాఖల డైరెక్టరేట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.