
అమ్మకు సాటిలేరెవ్వరూ..
కన్నీరొలుకుతూనే బిడ్డకు పాలు
బిస్వనాథ్ కరీనా.. బిహార్‌కు చెందిన వివాహిత. ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరం బయలుదేరింది. ఇంతలో రైలు ప్రమాదం.. కుటుంబసభ్యులు చెల్లాచెదురయ్యారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఘటనాస్థలి వద్ద వెతుకులాడింది. చివరకు అందరూ కలిసినా.. అన్నా వదిన మాత్రం ప్రాణాలతో లేరు.
గుండెలు పిండేసే విషాదం ఆమెను కలచి వేస్తోంది. మరోవైపు నెలరోజుల బిడ్డ ఆకలితో రోదిస్తోంది. దీంతో కరీనా ఘటనాస్థలి వద్ద కూలబడిపోయి కన్నీరొలుకుతూనే.. ఒడిలో బిడ్డకు పాలు పట్టిన విధం చూపరుల కంటతడి పెట్టించింది.