ఊయలతాడే ఉరితాడయింది... | accidentally girl died in kadapa district | Sakshi
Sakshi News home page

ఊయలతాడే ఉరితాడయింది...

Published Thu, Mar 19 2015 8:41 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accidentally girl died in kadapa district

కడప అర్బన్: ఊయల తాడు ఓ చిన్నారి పాలిట ఉరితాడయింది. ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కడప జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.  వివరాలిలా ఉన్నాయి...  కడప పట్టణంలోని మరియపురానికి చెందిన నర్సింహులు, మారెమ్మ దంపతులు. వీరు స్థానికంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు.

వారి రెండో కుమార్తె నయోమి(10) గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఊయల ఊగుతోంది. అయితే, ప్రమాదవశాత్తు ఊయల తాడు ఆ బాలిక గొంతుకు బిగుసుకుంది. దాని నుంచి బైట పడేందుకు చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో నయోమి ఊపిరాడక మృతి చెందింది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు నయోమి విగతజీవిగా కనిపించింది. కన్నకూతుర్ని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి పరిస్థితి చూపరులను సైతం కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement