పెళ్లి కోసం సినీనటి పూజలు | Actress ankita performs Pooja at Sri Kalahasti temple | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం సినీనటి పూజలు

Published Wed, Mar 19 2014 10:37 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

పెళ్లి కోసం సినీనటి పూజలు - Sakshi

పెళ్లి కోసం సినీనటి పూజలు

శ్రీకాళహస్తి : 'ఐ లవ్ యూ రస్నా' అంటూ అందరినీ అలరించి...అనంతరం నటిగా మారిన అంకిత ప్రస్తుతం వివాహం కోసం పూజలు చేస్తోంది. మంగళవారం ఆమె తన కుటుంబ సభ్యలుతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయానికి విచ్చేసింది. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా వేదపండితులు అంకితతో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామివారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు  తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం  వివాహం చేసుకునే పనిలో ఉన్నానని... వివాహం తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంకిత తెలిపింది.

 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెరంగేట్రం చేసిన అంకిత... ఆ సినిమా తరువాత పెద్ద హీరోలతో పలు సినిమాలలో నటించినా తెలుగునాట అంతగా ఆదరణ లభించలేదు. దాంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళనాట అడుగు పెట్టింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవటంతో
అంకిత అమెరికాలో పలు  స్టేజీ షోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement