srikalahasthi temple
-
శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి వేడుకలు
-
శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
-
రూ.200 కోట్లతో శ్రీకాళహస్తీశ్వరాలయం అభివృద్ధి
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రత్యేకమైందన్నారు. ఈ ఆలయాభివృద్ధి కోసం రూ.200 కోట్లతో కొత్త మాస్టర్ప్లాన్ను రూపొందించి, త్వరిత గతిన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. విద్యుత్ను ఆదా చేసేందుకు సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయంలో ఉన్న వెండి, బంగారు, నగదు నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. భక్తులకు పత్యక్ష సేవలతోపాటు ఆన్లైన్, పరోక్ష సేవల ద్వారానూ దగ్గరయ్యేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో ఇద్దరు హుండీ లెక్కింపులో దొంగతనం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, క్రిమనిల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. ఆలయ అనుబంధ స్కిట్ కళాశాల ఆలయానికి భారంగా మారిందన్నారు. అందులోని విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే నవరాత్రి, కార్తీక బ్రహ్మోత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఈవోకు సూచించినట్లు తెలిపారు. అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, దేవతా విగ్రహాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామని వాణీమోహన్ పేర్కొన్నారు. -
శ్రీకాళహస్తి ఆలయంలో థర్మల్ స్కానింగ్ గన్స్
చిత్తూరు, శ్రీకాళహస్తి: లాక్డౌన్ సడలించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ఈఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రతి భక్తుడూ మాస్కు ధరించేలా అవగాహన కల్పించడమే కాకుండా ఆలయంలో భక్తుల టెంపరేచర్ తెలుసుకునేందుకు థర్మల్ స్కానింగ్ గన్స్ ఏర్పాటు చేస్తామని, అలాగే చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజర్ స్టాండ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆలయంలో ప్రవేశించే భక్తులను డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా పంపి పిచికారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాహుకేతు పూజలు చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఒక పీటకు ఒక పూజా టికెట్టు మాత్రమే అనుమతిస్తామన్నారు. -
వెండి అంబారీపై పరమేశ్వరుడు..
సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కొడి ఉత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు, పూజార్లు వేదమంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి పురాణాల్లో ఒక గాథ కూడా ఉంది. పాలసముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన హాలాహలాన్ని మింగిన శివుడు రాక్షసుల నుంచి విశ్వాన్ని రక్షించాడు. లోకకల్యాణార్థం పరమశివుడు హాలాహలం మింగి తన కంఠంలో దాచుకుని మగత నిద్రలోకి వెళ్లిపోతారు. స్వామివారిని మేల్కొల్పేందుకు దేవతలు చేసే మొదటి ఉత్సవాన్ని ధ్వజారోహణం అని పిలుస్తారు. ఈ రాత్రిని దేవరాత్రి అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి గర్భాలయం ఎదురుగా ఉన్న బంగారు ధ్వజస్తంభానికి ఆలయ వేదపండితులు, ప్రధానార్ఛకులు కలశాలు స్థాపించి, హోమం వెలిగించి స్వామివారి దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప, సుబ్రమణ్యస్వామి, వినాయకస్వామి, చండికేశుడు కలిసి పంచమూర్తులను చతురస్రాకారంలో నిలిపి పలు రకాల పుష్పాలతో విశేష రీతిలో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర గంగా జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకించారు. భక్తులు సమర్పించిన కొడి చీరలతో ధ్వజస్తంభాన్ని అలంకరించారు. ఉత్సవమూర్తులకు ఆలయ వేదపండితులు, అర్చకస్వాములు ధూపదీప నైవేద్యాలను సమరి్పంచి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారి ధ్వజారోహణ పూజల్లో ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మ«ధుసూదన్ రెడ్డి దంపతులు, అంజూరుతారక శ్రీనివాసులు, డీఎస్పీ నాగేంద్రుడు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు, ప్రధానార్చకులు సంబంధం స్వామినాథన్ గురుకుల్, కరుణాకర్ గురుకుల్, అర్ధగిరి ప్రసాద్ శర్మ, శివప్రసాద్శర్మ, శ్రీనివాస శర్మ, మారుతీశర్మ తదితరులతోపాటు ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఇంజినీరింగ్ సిబ్బంది, ఆలయ ఏఈఓలు మోహన్, రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు. «ధ్వజారోహణ పూజలకు శ్రీకాళహస్తిలోని బహుదూర్పేటకు చెందిన బయ్యా నాగమ్మ, ఆమె కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సోమవారం ఉదయం స్వామీఅమ్మవార్లు, పంచమూర్తులతో కలసి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉత్సవమూర్తులకు ముందు ఒంగోలు జాతికి చెందిన నందులు రెండు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అయితే ఈ నందులు రెండు కూడా శ్రీకాళహస్తీశ్వరాలయ గోశాలలో పుట్టి పెరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తులను రాజేంద్ర గురుకుల్ విశేషరీతిలో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు మేళతాళాలు బ్యాండ్ వాయిద్యాలు, తోరణాలు, గొడుగులు, వివిధ రకాల నాట్య కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్రెడ్డి, డీఎస్పీ నాగేంద్రుడు, ఉభయదారులు బయ్యానాగమ్మ, ఆమె కుమారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి వాహన సేవలు శ్రీకాళహస్తి: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో తిరునాళ్లు నిర్వహించనున్నారు. ఈ తిరునాళ్లను భూతరాత్రి అంటారు. ఈ సందర్భంగా స్వామివారిని నిద్రలేపేందుకు భూతగణాలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాయని ప్రతీతి. అందుకే ఈ రాత్రిని భూతరాత్రి అని పిలుస్తారు. శ్రీస్వామిఅమ్మవార్లు ఉదయం సూర్యప్రభ, చప్పరం వాహనాలపై రాత్రి భూత–శుక వాహనాల్లో ఊరేగి, భక్తులకు దర్శన భాగ్యం కలి్పస్తారు. ప్రతి ఏటా హరిజన సేవాసంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. అనుబంధ ఆలయాల్లో శివరాత్రి వేడుకలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 9 శివాలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 శుక్రవారం విశేష అభిషేకాలు, ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. పెద్దకన్నలి గ్రామంలో వెలసిన శ్రీదుర్గాంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 24 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ కలశ స్థాపన, ధ్వజారోహణం, 21న మహా శివరాత్రి అభిషేకం, రాత్రి లింగోద్భవం, 22వ తేదీ విశేష అభిషేకం, అలంకారం, 23న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 24న కలశ ఉద్వాసన, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఊరందూరులో... ఊరందూరు గ్రామంలో వెలసిన శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో 21వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి రోజున ఉదయం 8 గంటలకు అభిõÙకం, 9 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు వివరించారు. వేడాం వేయి లింగాల కోన సహస్రలింగేశ్వర స్వామి, విరూపాక్షపురంలో వెలసిన అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం, చల్లేశ్వరస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి పట్టణంలో ముత్యాలమ్మ వీధిలో వెలసిన చక్రేశ్వరస్వామి ఆలయం, దుర్గమ్మ కొండ కింద ఉన్న దుర్గేశ్వరస్వామి ఆలయం(దుర్గా మల్లేశ్వర స్వామి), బొక్కిసంపాలెం గ్రామంలో వెలసిన కోదండ రామేశ్వరస్వామి ఆలయాల్లో 21వ తేదీ ఉదయం 8 గంటలకు అభిõÙకం నిర్వహిస్తామని తెలిపారు. -
వైభవం: శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వామివారి భక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు రాజేష్ గురుకుల్ ఆధ్వర్యంలో పట్టుపీతాంబరాలు, గజమాలలు, విశేషాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని పల్లకిపై ఆశీనులు చేశారు. తదుపరి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోని భక్తకన్నప్ప ఆలయం వరకు మేళతాళాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. అక్కడ ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అర్చకులు అర్ధగిరి, సంబంధం, వరదా గురుకుల్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజపటాన్ని ఆరోహింపజేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు బోయ కుల సంఘం నాయకులు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీస్వామి,అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగారు. భక్త కన్నప్ప కొండపైకి ఉత్సవమూర్తి ఊరేగింపు నేడు భవుడి ధ్వజారోహణం శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మాఘ బహుళ నవమిని పురస్కరించుకుని స్వామి వారి ధ్వజారోహణం చేపట్టనున్నట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఉదయం అర్చకులు అలంకార మండపంలో స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తదుపరి ఉత్సవమూర్తులను స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేస్తారు. స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. దర్బలతో చేసిన తాడును శాస్త్రోక్తంగా ధ్వజస్తంభానికి ఆరోహింపజేస్తారు. భక్తులు సమర్పించే చీరలతో కొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కన్నప్ప ధ్వజారోహణ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, చిత్రంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి సతీమణి శ్రీవాణి, కుమార్తె పవిత్ర తదితరులు -
శ్రీకాళహస్తిలో ‘క్షుద్ర’ కలకలం
శ్రీకాళహస్తిలో తరచూ క్షుద్ర పూజల నిర్వహణ కలకలం రేపుతోంది. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పదవీయోగం సిద్ధిస్తుందని.. గుప్త నిధుల లభ్యమవుతాయని.. శత్రువులకు హాని చేయవచ్చనే మూఢ నమ్మకాలతో ఒళ్లు గగుర్పొడిచే పూజలు నిర్వహిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వేడాం సమీపంలోని భైరవకోనలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి సమాచారం మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఓ ఉద్యోగిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి, నూతన సంవత్సరం వంటి ముఖ్యమైన రో జుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ జనసంచారం పెద్దగా ఉండదు. దీంతో ఈ ప్రాంతాన్ని కొందరు మూఢ నమ్మకాలతో కొన్ని పూజలకు నిలయంగా మార్చుకున్నారు. ఎన్నికల ముందు.. సాధారణ ఎన్నికల ముందు 2018 జనవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు భైరవ కోన వద్ద క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజను ఆలయంలో పనిచేసే అధికారి ధనపాల్ అనే వ్యక్తి నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల తరువాత తిరిగి ఆయన విధుల్లో చేరారు. అది కూడా పదోన్నతిపై. అతని పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరేందుకు అప్పటి దేవదాయశాఖ మంత్రి రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారని తెలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆయన ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నా రు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ధనపాల్ సహకారంతో చెన్నైకి చెందిన కొందరు భైరవ కోనలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉద్యోగి సూచనల మేరకే.. శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి సూచనల మేరకే భైరవ కోనలో ఈ పూజలు నిర్వహించేందుకు వచ్చినట్టు తమిళనాడు వాసులు చెప్పినట్టు సమాచారం. అయితే అక్కడ జరిగింది క్షుద్రపూజా.. మరేదైనా పూజ తేలాల్సి ఉందని సీఐ ఆరోహణరావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలో జరిగిన పూజలపై విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీచేశారు. అవి క్షుద్రపూజలే ఆగమ సంబంధమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటాక ఏ పూజ చేసినా క్షుద్రపూజే. – సింగరాజు ప్రకాశం పంతులు, పురోహితులు, శ్రీకాళహస్తి -
కుమ్మకై భక్తులపై నిలువు దోపిడి
సాక్షి,చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులను కొంతమంది నిలువు దోపిడి చేస్తున్నారు. భక్తుల రద్దీని సొమ్ము చేసుకుంటున్నారు.రాహు కేతు పూజల్లో అర్చకులు, సిబ్బంది కుమ్మకై భక్తుల నుంచి బలవంతంగా వసూళ్లు రాబడుతున్నారు. అక్కడి లగేజీ కౌంటర్ల వద్ద టీడీపీ నేతల అనుచరులు హల్చల్ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్ణయించిన ధరల కన్నా అధికంగా వసూళ్లు ఎందుకని అడిగిన వారి మీద దాదాగిరి చేస్తున్నా.. ఆలయ అధికారులు పట్టించుకోవట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ధౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. -
ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానానికి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన కాణిపాకం చేరుకుని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. -
పెళ్లి కోసం సినీనటి పూజలు
శ్రీకాళహస్తి : 'ఐ లవ్ యూ రస్నా' అంటూ అందరినీ అలరించి...అనంతరం నటిగా మారిన అంకిత ప్రస్తుతం వివాహం కోసం పూజలు చేస్తోంది. మంగళవారం ఆమె తన కుటుంబ సభ్యలుతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయానికి విచ్చేసింది. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా వేదపండితులు అంకితతో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామివారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం వివాహం చేసుకునే పనిలో ఉన్నానని... వివాహం తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంకిత తెలిపింది. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెరంగేట్రం చేసిన అంకిత... ఆ సినిమా తరువాత పెద్ద హీరోలతో పలు సినిమాలలో నటించినా తెలుగునాట అంతగా ఆదరణ లభించలేదు. దాంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళనాట అడుగు పెట్టింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవటంతో అంకిత అమెరికాలో పలు స్టేజీ షోలు చేసింది. -
సీమాంధ్ర బాధ్యత కిరణ్దే: లగడపాటి
శ్రీకాళహస్తి: రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా సీమాంధ్ర బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన ఆదివారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు నామమాత్రంగా అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు నటిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి అధిష్టానాన్ని ఎదిరించే ధైర్యం వారికి లేదన్నారు. ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకుపోయారని, అయితే ఉద్యమాన్ని కేంద్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న వారు తర్వాత పాలించిన దాఖలాలు లేవన్నారు.