సీమాంధ్ర బాధ్యత కిరణ్‌దే: లగడపాటి | Seemandhra Responsibility on Kiran kumar reddy, says Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బాధ్యత కిరణ్‌దే: లగడపాటి

Dec 22 2013 11:34 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీమాంధ్ర బాధ్యత కిరణ్‌దే: లగడపాటి - Sakshi

సీమాంధ్ర బాధ్యత కిరణ్‌దే: లగడపాటి

రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా సీమాంధ్ర బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.

శ్రీకాళహస్తి: రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా సీమాంధ్ర బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన ఆదివారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు నామమాత్రంగా అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు నటిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి అధిష్టానాన్ని ఎదిరించే ధైర్యం వారికి లేదన్నారు.

ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకుపోయారని, అయితే ఉద్యమాన్ని కేంద్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న వారు తర్వాత పాలించిన దాఖలాలు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement