lagadapati rajagopal
-
సర్వేతో ప్రాణం తీశారు!
-
అమరావతి సాక్షిగా మరో కుట్రకు ప్లాన్
-
లగడపాటి సర్వే వట్టిదే..
* వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు * ఆయన ఎలాంటి సర్వే చేరుుంచలేదు.. * టీడీపీ, కాంగ్రెస్ నేతలు * ఆయనతో అలా చెప్పించారు * జగన్ వెంటే జనం.. * జగన్ సీఎం కావడం ఖాయం సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళిపై లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వే చేయించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆయన ప్రతిసారీ ఒక ఏజెన్సీతో సర్వే చేయించేవారని, కానీ ఈసారి మాత్రం ఆయన అసలు సర్వే చేయించలేదని తెలిపారు. తాను చెప్పేది అవాస్తవమైతే లగడపాటి వెంటనే స్పందించాలని అంబటి సవాల్ చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షతో, జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాకూడదనే దుగ్ధతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లగడపాటిని మేనేజ్ చేసి ఆయనతో ఆ విధంగా చెప్పించారని మండిపడ్డారు. లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే వైఎస్సార్సీపీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఎంత శాతం చొప్పున ఓట్లు వచ్చారుు అనే విషయాలు ఎందుకు చెప్పలేదని అంబటి నిలదీశారు. ఇవేవీ చెప్పకుండా టీడీపీకి అన్ని స్థానాలు వస్తాయి, ఇన్ని స్థానాలు వస్తాయంటూ లగడపాటి తన మనస్సులోని కోరికను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. నిన్న, మొన్న వెలువడిన మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి వైఎస్సార్సీపీ కంటే అత్యధిక సీట్లు వచ్చాయి కానీ, అత్యధిక ఓట్లు మాత్రం రాలేదని ఆయన స్పష్టం చేశారు. అరుునప్పటికీ ఆ ఫలితాలను చూపుతూ కొందరు వైఎస్సార్సీపీ ఓడిపోతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడంటూ ఊదర గొడుతున్నారని, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చి చెప్పారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన నెలరోజుల తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల్లో అనేకమైన రాజకీయ మార్పులు, పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను చూసో, చంద్రబాబును చూసో ఓట్లు వేయలేదని, స్థానిక వ్యక్తులకు, అక్కడి సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేశారని వివరించారు. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. ఈ రాష్ట్రానికి జగన్ సీఎం కావాలో, లేక చంద్రబాబు సీఎం కావాలో ఆలోచించుకుని మరీ ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారని అంబటి వెల్లడించారు. ఇదే విషయాన్ని నీల్సన్ మార్గ్ సర్వే కూడా వెల్లడించిందని, గతంలో ఈ సంస్థ చేసిన అనేక సర్వేలు నూటికి నూరు శాతం నిజం అయ్యూయని ఆయన చెప్పారు. శుక్రవారం వెలువడే ఫలితాల్లో వైఎస్సార్సీపీ 110 అసెంబ్లీ సీట్లు, 20కి పైగా పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతుందని, సీమాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఇతర అనేక సర్వేలు కూడా సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేస్తున్నాయన్నారు. అరుుతే చంద్రబాబు, టీడీపీ నాయకులు ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నారని, వారి ఉత్సాహంపై శుక్రవారం వెలువడే ఫలితాలు నీళ్ళు చల్లనున్నాయని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను చూసి కొంతమంది అమాయకులు చట్ట వ్యతిరేకంగా పందేలు కాస్తున్నారని, వారు నష్టపోయే ప్రతి పైసాకు లగడపాటే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ సర్వేను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
లగడపాటివి బెట్టింగ్ సర్వేలు: గట్టు
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వేలు బెట్టింగ్‌ల కోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానంటున్న లగడపాటి.. సంపాదనే లక్ష్యంగా బెట్టింగ్ వ్యాపారం మొద లు పెట్టారని, అందులో భాగంగానే సర్వేలంటూ చిలకజోస్యం చెబుతున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీకి సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలిసిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని లగడపాటి భారీగా బెట్టింగ్‌లు కాశారని, దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందన్నారు. అయితే, బెట్టింగ్ కోసం టీడీపీ వాళ్లు ముందుకు రాకపోయేసరికి వారిని నమ్మించేందుకు లగడపాటి ఒక హైప్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. -
లగడపాటి అండ్ కో సర్వేల గారడీ
ఏలూరు కేంద్రంగా బెట్టింగ్ శిబిరం! వందల కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం టీడీపీదే గెలుపంటూ బోగస్ ప్రచారం ఆయన పేరు లగడపాటి రాజగోపాల్. బెట్టింగ్‌ల విషయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సన్యాసం స్వీకరించి తెరమరుగయ్యారు. సార్వత్రిక సమరం అనంతరం సర్వేల పేరుతో హల్చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తొలుత చెప్పిన లగడపాటి తర్వాత తూచ్ అన్నారు. తాజాగా టీడీపీకి చాన్స్ ఉందంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా లగడపాటి రంగులు మార్చడం వెనుక బడా బెట్టింగ్ స్కాం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా లగడపాటి బెట్టింగ్ దందాకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సర్వేల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు. లడగపాటి అండ్ కో భారీ బెట్టింగ్ స్కీ(స్కా)ం కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సర్వేల పేరుతో వందల కోట్లు దండుకున్న లగడపాటి తాజాగా అదే మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. గతంలో సర్వేల రాయుడిగా జనంలో కొంత ఇమేజ్ సంపాదించుకున్న రాజగోపాల్ దాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం రూపొందించారు. ఏలూరు కేంద్రంగా భారీ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. స్వాహాకు వ్యూహం... ఏలూరు అడ్డాగా నడిచే బెట్టింగ్ శిబిరానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ లగడపాటేనని తెలుస్తోంది. తెరపైకి మాత్రం బుకీలు కనిపిస్తారు. సర్వేలు తారుమారు చేయడం ద్వారా పందేల బరిని సిద్ధం చేస్తారు. ఆనక ఒకటికి రెండిస్తామని పందేలరాయుళ్లను రెచ్చగొడతారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలు సృష్టిస్తారు. విజయం సాధించే పార్టీ తరఫున లగడపాటి వర్గం పందెం వేస్తోంది. వందల కోట్లు స్వాహా చేస్తోంది. ఇది లగడపాటి మార్క్ సర్వేల వెనుక దాగున్న లోగుట్టు. ఇవేమీ తెలియని అమాయక జనం పందేల పేరుతో సర్వం పోగొట్టుకుంటున్నారు. అంతా బోగస్... సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గాలిని కోరుకున్నారు. విజయవాడలో లగడపాటి ఓటు వేసే సమయంలో కొన్ని టీవీ చానళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. అప్పటికి 50 శాతం పోలింగ్ పూర్తయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని లగడపాటి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని గురువారం లగడపాటి సర్వే విడుదల చేశారు. బెట్టింగ్ వ్యాపారంలో ఆరితేరిన లగడపాటికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బోగస్ సర్వేతో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో లగడపాటి గందరగోళానికి తెరతీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన సర్వే ఏమైంది... రాష్ట్రం ముమ్మాటికీ విడిపోదు. నా వద్ద సర్వేలు ఉన్నాయి అని నానా హడావిడి చేసిన లగడపాటి సర్వే ఏమైందని పలువురు ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. తప్పుడు సర్వేలు సృష్టించడం, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందడం లగడపాటికి వెన్నతో పెట్టిన విద్య అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకొని తెరమరుగైన రాజగోపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సర్కస్‌లో బఫూన్లా మారడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లీకేజ్ రాయుడు... 2009 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తోందని లగడపాటి తన అనుచరగణం ద్వారా లీకులిప్పించారు. అప్పటివరకు సందిగ్ధంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి పందేలు కాశారు. కాంగ్రెస్ గెలుస్తోందని లగడపాటి అనధికారికంగా సర్వే విడుదల చేశారు. దీంతో పందేలు రెండింతలయ్యాయి. నగర ంలోని ఒక సహకార బ్యాంక్‌లో పందెం సొమ్ము డిపాజిట్ చేసే విధంగా పందేల ఒప్పందం కుదిరింది. ఈ ఎన్నికల్లో లగడపాటి సుమారు రూ.100 కోట్లు పందెం గెలిచినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అంతర్జాతీయ బుకీలతో లగడపాటికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్ సర్వేల కోసం లక్షలు ఖర్చు చేసి బెట్టింగ్‌ల రూపంలో కోట్లు దండుకుంటారని భోగట్టా. -
నేతల పరార్
‘రండి బాబూ రండి.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎలాగోలా జనాన్ని తరలించి రాజమండ్రి సభను జయప్రదం చేయండి..’ అని ఆఫర్ ఇచ్చి ప్రాధేయపడినా జిల్లా నేతల నుంచి ఆశించిన స్పందన రాలేదు.. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెడుతున్న కొత్త పార్టీ ఏర్పాటు సభకోసం పడుతున్న తిప్పలు. చివరి బంతి ఇంకా మిగిలేఉందని సీమాంధ్రులను మభ్యపెట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు పదవిని పట్టుకుని వేలాడి.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. ఎన్నికలు సమీపించే తరుణంలో తీరుబడిగా రాజీనామా చేసి పార్టీ పెట్టబోతున్న కిరణ్ తీరుపై ప్రజల్లోనే కాదు.. నేతల నుంచి కూడాతీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త పార్టీ ఏర్పాటుకు బుధవారం ముహూర్తం పెట్టిన కిరణ్‌ను జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలో జరుపతలపెట్టిన సభను గట్టెక్కించి పరువు దక్కించమని పలువురికి కిరణ్ నేరుగా ఫోన్ చేసి బతిమాలినా సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. కాంగ్రెస్‌ను వీడి దూరంగా ఉన్న సీనియర్ నాయకులు సైతం అవసరమైతే మరో పార్టీలో చేరతాం తప్ప.. కిరణ్ పార్టీలోకి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి రాజమండ్రి సభకు తరలివెళుతున్నవారి సంఖ్య వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. పెద్దదిక్కు లగడపాటి? ఆదినుంచి రాష్ట్ర విభజన జరగదని, అడ్డుకుంటామని బీరాలు పలికిన లగడపాటి రాజగోపాల్ చివరికి తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. తర్వాత కిరణ్ పార్టీ పెడితే కొనసాగుతానంటూ మెలిక పెట్టారు. రాజకీయాల్లో తాను కొనసాగాలని సభలు పెట్టి ఒత్తిడి చేయాలంటూ లగడపాటి పలు నియోజకవర్గాల నేతలను ప్రాధేయపడినా ఫలితం దక్కలేదు. చివరికి కిరణ్ ప్రకటించిన కొత్త పార్టీలో వ్యూహకర్త అవతారం ఎత్తారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నగర మాజీ మేయర్ రత్నబిందు కిరణ్ పార్టీలో చేరడంతో ఆమెకు ఉపాధ్యక్షురాలి పదవిని కట్టబెట్టారు. నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాసిరెడ్డి అనురాధలు రాజమండ్రి సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, లగడపాటి నేతృత్వాన కార్పొరేషన్ ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ ప్యానల్‌ను పోటీకి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌కు చలమయ్య రాజీనామా.. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) మాజీ డెరైక్టర్ బొర్రా చలమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం పలువురు సెల్ మెసేజ్‌లు ఇచ్చారు. కైకలూరు కాంగ్రెస్ టికెట్‌ను ఆశించిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్ కొత్త పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన రాత్రి తన అనుచరులతో సమావేశం నిర్వహించి రాజమండ్రి బాట పట్టనున్నారు. కేడీసీసీబీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో కిరణ్‌ను కలిశారు. ఆయన కూడా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీలోకి వెళుతున్నట్టు సమాచారం. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న పిన్నమనేని పార్టీ ఫిరాయించడంతో ఆయన స్థానంలో శిష్ట్లా దత్తాత్రేయులును ఇన్చార్జిగా నియమిస్తూ డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న పిన్నమనేని వైస్‌చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించకపోవడంతో బొర్రా చలమయ్య అలిగి అప్పట్లో డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు వారిద్దరు సమైక్యంగా కొత్త పార్టీలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బుద్ధప్రసాద్‌కు బాబు పిలుపు.. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర విభజనతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి విదితమే. ఆయన కిరణ్ పార్టీవైపు వెళ్లకుండా టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంగళవారం చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లినట్టు సమాచారం. బుద్ధప్రసాద్ కొడుకు కోడూరు మండలంలో పర్యటించి కాంగ్రెస్ నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరబోతున్న తన తండ్రికి సహకరించాలని కోరడంతో పలువురు తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, బూరగడ్డ వేదవ్యాస్, యలమంచిలి రవి, వెలంపల్లి శ్రీనివాస్‌లు కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని తేలిపోయింది. వారు ఏ పార్టీ తీర్థం పుచ్చుకునేది ఇంకా తేలాల్సి ఉంది. -
బాబ్బాబు...రాజీనామాలు చేయండి
సాక్షి, విజయవాడ : బాబ్బాబు రాజీనామా చేయండి... ఎంపీ లగడపాటికి మద్దతివ్వండి... ఎంపీ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వర్గీయులందరికీ ఇలా ఫోన్లు వెళ్లాయి. ఎక్కువమంది నుంచి దీనికి స్పందన కొరవడింది. అసలు విషయానికొస్తే.. లోక్‌సభలో అవిశ్వాసం పెట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో పాటు మరో ఐదుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికే పార్టీ మారి కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న ఎంపీ వర్గానికి ఇదో మంచి అవకాశంగా మారింది. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారితో రాజీనామాలు చేయించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, పార్టీలో ఇతర పదవుల్లో ఉన్న నేతలకు కార్యాలయ సిబ్బంది నుంచి ఫోన్లు వెళ్లాయి. ఒక దశలో ఎమ్మెల్యేలు కూడా ఎంపీకి మద్దతుగా రాజీనామాలు చేస్తున్నారంటూ ప్రచారం సాగించారు. ఎంపీ రాజగోపాల్‌కు మద్దతుగా రాజీనామా చేసేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, విజయవాడ నగర అధ్యక్షుడు అడపా నాగేంద్రం, గౌరవాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు తిరస్కరించినట్లు సమాచారం. దీనిపై గౌరవాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న ఎంపీపై బహిష్కరణ వేటును వెనక్కి తీసుకోవాలని కోరుతామని, పార్టీ పదవులకు రాజీనామా చేయడం లేదని చెప్పారు. మరోపక్క ఎమ్మెల్యేలు కూడా ముందుకు రాలేదు. రాజీనామాలు చేసింది వీరే... పీసీసీ మాజీ కార్యదర్శి షేక్ ముక్తియార్, ఎస్సీ సెల్ నేతలు బెజవాడ యోహాన్, గుడ్డేటి విద్యాసాగర్, బొమ్మల శ్రీను, ఉమ్మడి ధనరాజ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిద్దుకూరి శివ, మాజీ కార్పొరేటర్లుమాగంటి నరసింహ చౌదరి, మురిపాల సత్యవతి, ఇతర నాయకులు పుట్టి శరత్‌కుమార్ యాదవ్, పోతిన పైడిరావు, షేక్ అజీజ్, కట్టా మల్లి, సీహెచ్ శాంతకుమార్ తదితరులు ఉన్నారు. -
మెత్తబడ్డ సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: రెండున్నర గంటల పాటు సాగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ముగిసింది. కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ పెద్దలు కోరారని తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆ ప్రాంత ఎంపీలు నమ్మకం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దని కోరామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. బిల్లు పెడితే వ్యతిరేకంగా ఓటెస్తామని చెప్పారు. బిల్లు పెడితే తమ సత్తా చూపుతామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సభను క్షణం కూడా నడవనీయబోమన్నారు. అయితే వార్ రూమ్ భేటీ చాలా బాగా జరిగిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా తెలంగాణ బిల్లు ఉంటుందన్నారు. సీమాంధ్రుల సమస్యలపై దిగ్విజయ్, జైరాం రమేష్ హామీయిచ్చినట్టు తెలిసింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పోలవరం, వనరుల పంపిణీ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. దీంతో సీమాంధ్ర ఎంపీలు కాస్త మెత్తబడినట్టు ప్రచారం జరుగుతోంది. -
కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్
గుంటూరు:రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన తరుణంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు సొంతపార్టీ కాంగ్రెస్ పై మండిపడ్డారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రలో కాంగ్రెస్ డిపాజిట్లు దక్కవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి.. విభజనపై కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటానికి దిగుతామని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులను, మేధావులను సంఘటితం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని లగడపాటి తెలిపారు. -
పాసులు ఎందుకివ్వరో ఢిల్లీలోనే తేల్చుకుంటాం:లగడపాటి
గుంటూరు:సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు పాసులు ఇవ్వకపోవడంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మండిపడ్డారు. తమ ప్రాంత నేతలకు పాసులు ఎందుకివ్వరో ఢిల్లీలోనే తేల్చుకుంటామన్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన లగడపాటి..తమకు పాసులు రాకపోవడం దురదృష్టకమరమైన అంశమన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే తేల్చుకుంటామన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంపైన మాత్రమే అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ పై కాదన్నారు. తాను కాంగ్రెస్ వాదిగా ప్లీనరీకి తప్పకుండా హాజరవుతానని లగడపాటి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఏఐసీసీ సమావేశానికి అధిష్టానం అనుమతి నిరాకరించింది. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావించే నేపథ్యంలో వివాదానికి ఆజ్యం పోసినట్లుగా ఉందని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. -
సీమాంధ్ర బాధ్యత కిరణ్‌దే: లగడపాటి
శ్రీకాళహస్తి: రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా సీమాంధ్ర బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన ఆదివారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు నామమాత్రంగా అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు నటిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి అధిష్టానాన్ని ఎదిరించే ధైర్యం వారికి లేదన్నారు. ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకుపోయారని, అయితే ఉద్యమాన్ని కేంద్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న వారు తర్వాత పాలించిన దాఖలాలు లేవన్నారు. -
జీర్ణించుకోలేకే జగన్‌పై విమర్శలు: అడుసుమల్లి
హైదరాబాద్: సమైక్య నినాదాన్ని జగన్మోహన్రెడ్డి బలంగా వినిపించడం జీర్ణించుకోలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాదని.. రాజగోపాల్‌లో ఢిల్లీ వీధులలో రాజకీయ డ్రామాలు ఆడడమే పనిగా ఆయన పేర్కొన్నారు. జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్మోహన్రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు. -
కొత్త పార్టీ కోసం సీఎం కలెక్షన్లు: అంబటి
హైదరాబాద్: సీఎం కిరణ్, లగడపాటి రాజగోపాల్వి నకిలీ సమైక్య ఉద్యమాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యవాదం పేరుతో కొత్తపార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే సీఎం వ్యూహమని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమని అన్నారు. కొత్త పార్టీ పెట్టుబడి కోసం సీఎం హోదాలో కిరణ్ వందల కొద్ది ఫైల్స్‌పై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటికి ఒక న్యాయం..సామాన్యుడొక న్యాయమా అని అంబటి ప్రశ్నించారు. ల్యాంకో గ్రూపు రూ.40 వేల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ల్యాంకోకు నెలకు రూ.570 కోట్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ల్యాంకో ఇన్ఫ్రాకు రూ.8 వేల కోట్ల రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేశాయని, తిరిగి రూ.3,500 కోట్ల రుణాలు కొత్తగా ఇచ్చాయని వెల్లడించారు. ఇవన్ని కొత్తపార్టీకి పెట్టుబడులా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు నిజమైన దత్తపుత్రుడు లగడపాటి కాబట్టే కేంద్రం ఆయనకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తోందన్నారు. కిరణ్, లగడపాటి కొత్త పార్టీ పెడితే ఓట్లు రావు, సీట్లు రావన్నారు. సీఎం పదవిని కిరణ్ వదిలేస్తే ఆయన్ను గుర్తుపట్టేవారుండరని అంబటి ఎద్దేవా చేశారు. -
విభజన నిర్ణయంతో మైండ్ బ్లాక్ : లగడపాటి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సొంత పార్టీపైనే ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీల్లానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాంతీయ పార్టీల్లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్టుగా రాష్ట్రాన్ని విభజిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీజెఎఫ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో లగడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన విషయంలో తమ పార్టీ అనూహ్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. తమకే తలతిరిగేలా, ఊహకు అందని విధంగా నిర్ణయం తీసుకుంటోందని చెప్పారు. విభజనపై ఒక జాతీయ విధానమంటూ ఉందా అని ఆయన ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని హైకమాండ్‌కు చెప్పామన్నారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలమని చెప్పాయని గుర్తు చేశారు. సమైక్యవాదమే గెలుస్తుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్‌తో అందరికీ అనుబంధం ఉందన్నారు. ఏపీ విభజనను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలు అంగీకరిస్తేనే ముందుకెళ్లాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని లగడపాటి అన్నారు. -
'ఆంధ్రా అక్టోపస్'కు ఆగ్రహం
'చేయి చేసుకోవడానికి వెనుకాడను. మీ అంతు చూస్తా' ఈ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. దేశంలో అత్యంత పురాతన పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి నోటి దరుసుతనానికి రుజువులీ వ్యాఖ్యలు. ఆయనెరో కాదు విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. నిత్య వివాదాలతో ఆయన జగడపాటిగా ప్రసిద్ధి చెందారు. దురుసు ధోరణితో సార్థక నామధేయగా ఆయన నడుచుకుంటున్నారు. ఆంధ్రా అక్టోపస్‌గా పేరున్న లగడపాటి మరోసారి పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. గతంలో 'సాక్షి' మీడియా ప్రతినిధులపై చిందులేసిన ఈ సర్వేల సర్వారాయుడు తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై ఒంటికాలిపై లేచారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పెట్రేగిపోయారు. జీఓఎం తాను నివేదిక సమర్పించానని చెప్పడానికి లగడపాటి బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎంపీగారు నోటికి పని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడబోనంటూ వీధి రౌడీలా బెదిరించారు. లగడపాటికి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. మీడియాలో ప్రచారం కోసం ఆయన ఎన్నో విన్యాసాలు చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడినన్న విషయం మర్చిపోయి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు తీరుగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు సొంత పార్టీ పచ్చ జెండాతో ఊపడంతో లగడపాటికి ఊపిరి సలపడం లేదు. దీంతో ఇన్నాళ్లు సమైక్యం పాట పాడిన ఆయన దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఓవరాక్షన్ కారణంగా అధిష్టానం కూడా ఆయనను దూరం పెట్టింది. సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్నా ప్రజలూ ఆయనను నమ్మడం లేదు. వ్యాపారపరంగా కూడా నష్టాల్లో చిక్కుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన లగడపాటి నిరాశ, నిస్పృహతోనే దిగజారి ప్రవరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక నుంచైనా హుందాగా నడుచుకోవాలని సలహాయిస్తున్నారు. మరీ లగడపాటి మారతారా? -
జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి
న్యూఢిల్లీ: జగడపాటిగా పాపులరయిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. ఇంతకుముందు 'సాక్షి'కి అక్కసు వెళ్లగక్కిన లగడపాటి తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపిన విషయాన్ని తెలిపేందుకు లగడపాటి ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నలు సంధించడంతో ఆయన అసహనం ప్రదర్శించారు. ప్రశ్నలు అడిగిన పాత్రికేయులపై రుసరుసలాడారు. అవసరమయితే చేయి కూడా చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న వారు కల్పించుకుని ఆయనను పక్కకు తీసుకుపోయారు. జర్నలిస్టుల పట్ల లగడపాటి వ్యవహరించిన తీరును తెలంగాణ పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ఆయన వైఖరి అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నాయి. -
పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నా: లగడపాటి
న్యూఢిల్లీ: మూడు ప్రాంతాల ప్రజలు ఏకాభిఫ్రాయానికి వచ్చినప్పడే విభజన జరగాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అందరి ఆకాంక్ష హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే విభజిస్తున్నారన్న అనుమానం ఉందన్నారు. మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని పునరుద్ఘాటించారు. విడిపోతామని ఏ ప్రాంతం వారూ చెప్పడం లేదన్నారు. రాష్ట్రాన్ని విడదీయొద్దని శ్రీకృష్ణా కమిటీ స్పష్టం చెప్పిందన్నారు. హైదరాబాద్‌తో రాష్ట్ర ప్రజలందరికీ విడదీయలేని బంధం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ నుంచి 60 శాతం ఆదాయం వస్తోందని వెల్లడించారు. విభజనపై ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. సమైక్యం కోసం సీఎం కిరణ్ పోరాడుతున్నారని వెనకేసుకొచ్చారు. జీఓఎంకు తాను నివేదిక ఇచ్చానని తెలిపారు. రాజీనామా ఆమోదించనందున తానింకా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నానని లగడపాటి స్పష్టం చేశారు. -
లగడపాటి తీరును ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు
హైదరాబాద్: మీడియా ప్రతినిధుల పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరును జర్నలిస్టు సంఘాలు, నాయకులు ఖండించారు. పాత్రికేయులపై లగడపాటి వాడిన పదజాలం సముచితం కాదని సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చాలా పరుషంగా మాట్లాడారని పేర్కొన్నారు. లగడపాటి వాడిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లగడపాటి అనుచిత పశ్చిమగోదావరి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కె. మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి వినాయకరావు వ్యాఖ్యలను ఖండించారు. నోరు జారి మాట్లాడిన లగడపాటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లగడపాటి వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు మెదక్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరు..?
పురందేశ్వరి వ్యవహారంపై వీడని వివాదం ఎంపీ వర్గం నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా, సీమాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం అంటూ విజయవాడలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు నిర్వహించిన సమావేశం వివాదం ఇంకా వీడటం లేదు. ఒకపక్క కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తామంతా ఖండిస్తుంటే, ఎంపీ లగడపాటి రాజగోపాల్ వాటిని సమర్ధించడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇరుకున పడేసింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెపై అభాండాలు వేయటం మంచిది కాదని, తాను విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా వారి భయాలను వివరించారంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి పురందేశ్వరిని సమర్ధించిన సంగతి తెలిసిందే. అసలు పురందేశ్వరి పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరన్న అంశంపై కాంగ్రెస్‌పార్టీలో చర్చ నడుస్తోంది. ఎంపీ రాజగోపాల్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ముందుండి అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం. మరికొందరు నాయకులు కేంద్ర మంత్రితో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం నాడు నగర ప్రధమ మేయర్ టి.వెంకటేశ్వరరావు సంతాపసభ సందర్భంగా ఒక నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. ‘మేం కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడాలి, మీరేమో ఏర్పాట్లు చేస్తారా?’ అంటూ ఎంపీ వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్‌పై సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే కేంద్రమంత్రి పురందేశ్వరి పర్యటన ఎంపీ రాజగోపాల్‌కు తెలిసే జరిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నెలరోజుల తర్వాత నగరానికి వచ్చిన ఎంపీ రాజగోపాల్.. తనను కాంగ్రెస్ పార్టీ, నాయకులు నమ్మకపోయినా, ప్రజలంతా పూర్తిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చూస్తుంటే ఎంపీ రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని, అదే సమయంలో విజయవాడ నుంచే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనపడుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీకి తాము ఎలా అండగా నిలబడాలని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ నిలబడితే తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. -
అధిష్టానంపై తిరగబడతాం: లగడపాటి
విజయవాడ : రాష్ట్రాన్ని విభజిస్తే పదవులు సైతం వదులుకొని అధిష్టానంపై తిరగబడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించిన కొన్ని పార్టీలు చేతకాని తనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన శనివారమిక్కడ అన్నారు. అటువంటి పార్టీలను బండ కేసి కొట్టాలని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఏర్పాటు దిశగా లేఖలు ఇవ్వద్దని పార్టీలను వేడుకున్నామని లగడపాటి తెలిపారు. రాజకీయ పార్టీలను ప్రజలు ద్వేషిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పటానికి ఎదురు చూస్తున్నారనిఅన్నారు. రాజకీయ పార్టీల అధినేతలు ఈ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లగడపాటి రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
లగడపాటీ.. నీ భరతం పడుతం: హరీశ్‌రావు
హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ భరతం పడతామని, ల్యాంకో అక్రమాలపై విచారణ జరిపి ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా కక్కించి, కటకటాల వెనక్కు పంపిస్తామని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లగడపాటికి దమ్ముంటే.. ల్యాంకో వ్యవహారాలపై బహిరంగ చర్చకు రావాలని, విజయవాడలోనే వేదిక సిద్ధంచేసి, తేదీ నిర్ణయించాలని హరీష్ సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడితే దోపిడీకి అవకాశం ఉండదనే భయంతోనే.. లగడపాటి సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నాడని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండి, తెలుగు ప్రజలు చీకట్లో ఉంటే... ల్యాంకోలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎలా అమ్ముకున్నారు? అని ప్రశ్నించారు. సమ్మెతో రూ.వంద కోట్లు సంపాదించిన ఘనాపాటి లగడపాటే అన్నారు. ఇలాంటి దోపిడీ దొంగల మీద ఉద్యమం చేయాలని సీమాంధ్రులకు హితవు పలికారు. రూ.900 కోట్లు తాగునీటికి, రూ.187 కోట్లు మహిళా మెడికల్ కళాశాలకు ఎలాంటి కేబినెట్, శాసనసభ తీర్మానం లేకుండా సీఎం కిరణ్ చిత్తూరు జిల్లాకు నిధులు తీసుకెళ్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని కోరారు. -
'మొదటి నుంచి వ్యాపారంతోనే డబ్బు గడించా'
ఢిల్లీ: తాను మొదటి నుంచి వ్యాపారంతోనే ధనాన్ని ఆర్జించినట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక డబ్బు గడించానన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'నేను రాజకీయీల్లోకి రాకముందే నాకు కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని' వివరించారు. 2004 లో 170 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, 2009లో 209 కోట్లకు చేరిందన్నారు. రాజీనామా అంశంపై ఏమైనా ఒత్తిడి ఉందా?అని విలేకర్లు ప్రశ్నించగా.. ఎటువంటి ఒత్తిడి తనపై లేదన్నారు. కాగా, సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాజీనామాను త్వరలోనే ఆమోదింపజేసుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన కేంద్రమంత్రులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం అనేది వారి ప్రాధమిక హక్కు అని లగడపాటి తెలిపారు. ఇందులో భాగంగానే లోక సభ స్పీకర్ మీరా కుమార్ ను సోమవారం కలవడానికి ప్రయత్నించానన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరా కుమార్ మంగళవారం కూడా కార్యాలయానికి రాలేదన్నారు. అక్టోబర్ 17 వ తేదీన తప్పకుండా స్పీకర్ ను కలిసి రాజీనామాను ఆమెదించుకుంటానన్నారు. -
ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్
న్యూఢిల్లీ: తమ రాజీనామాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోదని రాజంపేట కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన నేడు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ రాజీనామా ఆమోదం కోసం స్పీకర్‌ను కలవాలని వచ్చినట్టు తెలిపారు. రాజీనామా ఆమోదంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరామన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఉండవల్లి, లగడపాటి, అనంత, తాను ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. సమైక్యవాద పార్టీల నాయకులను తమ పార్టీ నేతలు కలిస్తే తప్పేందని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు. -
లగడపాటిని ఏకాకి చేస్తారా?
అందరిదీ ఒకదారైతే ఉలిపి కట్టెది మరొకదారి అన్న నానుడి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన ఆయన పండగపూట 'తనదైన శైలి' ప్రదర్శించారు. హస్తినలో హడావుడి చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎంపీ పదవికి తాను చేసిన రాజీనామాను ఎలాగైనా ఆమోదింపజేసుకుంటానని బీరాలు పలికి చివరకు తుస్సుమనిపించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు లగడపాటి ప్రకటించారు. దీన్ని ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో స్పీకర్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీనామాలు చేసిన తోటి ఎంపీలతో కలిసి అంతకుముందు స్పీకర్ ఆఫీస్‌కు వెళ్లిన లగడపాటి- దసరా రోజున మాత్రం ఒంటరిగా ముందడుగు వేశారు. తానొక్కడికే చిత్తశుద్ధి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. స్పీకర్ లేకపోవడంతో తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తన రాజీనామా ఆమోదం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దయాదాక్షిణ్యాలపై ఆధారపడివుందని లగడపాటి కుండబద్దలుకొట్టారు. వేరే రాష్ట్రాల ఎంపీలు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించారని, తమవి మాత్రంపెండింగ్లో పెట్టారని వాపోయారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వ బలం 213కు పడిపోతుందన్నారు. రాష్ట్రంలో సమన్యాయం ఎవరు కోరుకోవడం లేదని, సమైక్యాంధ్రే కావాలనుకుంటున్నారని చెప్పారు. మూడు ప్రాంతాలు అంగీకరిస్తేనే రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును మూడు ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భయంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. సీఎం కిరణ్, సీనియర్ నేతలను అస్త్రాలుగా ప్రయోగించి రాజీనామాలపై వెనక్కు తగ్గేలా ఎంపీలపై ఒత్తిడి తేవాలని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. దూకుడు ప్రదర్శిస్తున్న లగడపాటిని ఒంటరిని చేసేందుకు కూడా అధిష్టానం వెనుకాడదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల దూకుడుకు కళ్లెం వేసిన కాంగ్రెస్ పెద్దలు తాజాగా ఎంపీలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఎంపీలు రాజీనామాలకు కట్టుబడతారా, అధిష్టానంతో రాజీ పడతారా అనేది వేచి చూడాల్సిందే! -
దుర్గమ్మ దర్శనానికి నేతలు దూరం
= సమైక్య సెగతో ముఖం చాటేసిన మంత్రులు = కానరాని ద్వితీయశ్రేణి నేతలు సాక్షి, విజయవాడ : రాజకీయ నేతలకు సమైక్య సెగ తలగడంతో వారంతా దుర్గమ్మ దర్శనానికి దూరంగా ఉన్నారు. నేతలు ఏటా దసరా ఉత్సవాల్లో కొండపైన హల్చల్ చేసేవారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అనుచరగణంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చి వీఐపీ దర్శనాలు చేసుకునేవారు. వారికి ఆలయమర్యాదలతో స్వాగతం.. వేదపండితులతో ఆశ్వీరాదం.. అమ్మవారి కుండువాలు.. ప్రసాదాలు ఒకటేమిటి ఆ హడావుడే వేరుగా ఉండేది. ఇక ఉత్సవాల ఏర్పాటులో కూడా నేతలు తమదైన పాత్ర పోషించేవారు. దేవాదాయశాఖ మంత్రి నుంచి కిందిస్థాయిలో ఉత్సవ కమిటీ సభ్యుల వరకు ఎవరికివారు అధికారులకు ఉచిత సలహాలిచ్చి వాటిని పాటించాలంటూ హడావుడి చేసేవారు. ఇందకీలాద్రిపై పండగ పది రోజులూ రాజకీయ నాయకుల హడావుడే ఎక్కువగా కనపడేది. ఈ ఏడాది కనబడితే ఒట్టు.. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. దసరా ఉత్సవాలు సగం రోజులు అయిపోయాయి. ఇప్పటికే పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించినా, వాటికి ప్రజాప్రతినిధులు దూరంగానే ఉన్నారు. కనీసం ఒక్క సలహా కాని, సూచన కాని చేయడం లేదు. ఇక దుర్గగుడిపై రాజకీయ నాయకులు కనపడితే ఒట్టు. ఒకరిద్దరు నాయకులు అమ్మవారిపై భక్తితో వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప.. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు బాగోనందున ఉత్సవాల్లో జోక్యం చేసుకుని విమర్శలుపాలు కావడం ఎందుకని దూరంగా ఉన్నామంటూ విజయవాడ నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘సాక్షి ’ వద్ద వ్యాఖ్యానించారు. ఉద్యమ సెగే కారణం... నాయకులు ఉత్సవాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం సమైక్య ఉద్యమమేనని భక్తులు నమ్ముతున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహంతో పాటు రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, విశ్వరూప్, కన్నా లక్ష్మీనారాయణ, కేపీ సారథి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణంరాజు తదితర నాయకులంతా అమ్మవారిని దర్శించుృున్నవారే. ఈ ఏడాది వారిలో చాలామంది ముఖం చాటేశారు. ఎంపీ లగడపాటి, కొనగళ్ల నారాయణరావులు ప్రజలకు అందుబాటులోనే లేరు. టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ఇంద్రకీలాద్రి ఎక్కేందుకు సాహసించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మాత్రం గురువారం సాయంత్రం దుర్గగుడి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి కేపీ సారథి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని సమాచారం. వీరుగాక మిగిలిన మంత్రులు దుర్గగుడి వైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఈ ఏడాది దుర్గగుడికి రాకపోవచ్చని తెలిసింది. ఈసారి ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య మాత్రమే దుర్గగుడికి వచ్చారు. సమైక్యానికి మద్దతు ప్రకటించి అమ్మవారి దర్శనం చేసుకుని చల్లగా జారుకున్నారు. ఉత్సవ కమిటీ ఊసే లేదు... గత ఏడాది ఉత్సవాలు ప్రారంభమైన రెండోరోజే 51 మందితో ఉత్సవ కమిటీ వేశారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి సమైక్య ఉద్యమంలో తలమునకలై ఉన్నందున ఉత్సవ కమిటీ గురించి పట్టించుకోలేదని చెబుతున్నారు. భక్తులకు సౌకర్యాలకు మాత్రం ఏమాత్రం లోటు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.