కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్ | if state bifurcation happens, congress will lose deposits in seemandhra:lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్

Published Mon, Jan 27 2014 7:51 PM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్ - Sakshi

కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్

గుంటూరు:రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన తరుణంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు సొంతపార్టీ కాంగ్రెస్ పై మండిపడ్డారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రలో కాంగ్రెస్ డిపాజిట్లు దక్కవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి.. విభజనపై కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటానికి దిగుతామని తెలిపారు.

 

ఈ క్రమంలో విద్యార్థులను, మేధావులను సంఘటితం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని లగడపాటి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement