సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత రాజధాని హైదరాబాద్ కొత్త రాష్ట్రమైన తెలంగాణ పరిధిలోకి వెళ్లినందున ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇందుకోసం ఐదుగురు నిపుణులతో కూడిన ఒక కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. వీరందరికీ నగరీకరణ, నగర నమూనాలు, సంబంధిత శాఖలు, సంబంధిత విద్యాసంస్థలతో అనుబంధం ఉన్న నిపుణులే కావడం విశేషం. పశ్చిమబెంగాల్ 1958వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్, పట్టణాభివృద్ధి శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న కె.శివరామకృష్ణన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ సంస్థ డెరైక్టర్ ఆరోమర్ రేవి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ జగన్ షా, అర్బన్ డిజైన్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ చీఫ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రతీన్ రాయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నవిధంగా ఈ కమిటీ నోటిఫైడ్ తేదీ అయిన మార్చి 1 నుంచి ఆరు నెలల్లోపు కొత్త రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడం, నగర ప్రణాళికను ఏర్పాటుచేయడం, అవసరమైన ఆర్థిక అంచనాలను రూపొందించడం వంటి అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం, ఇతర వర్గాలతో సంప్రదించి ఈ కమిటీ నివేదిక తయారుచేసి కేంద్రానికి సమర్పించనుంది. కె.సి.శివరామకృష్ణన్ కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌గా, పర్యావరణ, పట్టణాభివృద్ధి శాఖలో కీలక విధులు నిర్వహించా రు.1992లో పదవీవిరమణ పొందారు. పాలసీ, పరిపాలన అంశాలపై అంతర్జాతీయంగా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
రాజధాని కోసం నిపుణుల కమిటీ
Published Sat, Mar 29 2014 12:24 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM
Advertisement