'మొదటి నుంచి వ్యాపారంతోనే డబ్బు గడించా' | money earning is with my own business:lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

'మొదటి నుంచి వ్యాపారంతోనే డబ్బు గడించా'

Published Tue, Oct 15 2013 8:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

'మొదటి నుంచి వ్యాపారంతోనే డబ్బు గడించా'

'మొదటి నుంచి వ్యాపారంతోనే డబ్బు గడించా'

ఢిల్లీ: తాను మొదటి నుంచి వ్యాపారంతోనే ధనాన్ని ఆర్జించినట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక డబ్బు గడించానన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'నేను రాజకీయీల్లోకి రాకముందే నాకు కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని' వివరించారు.  2004 లో 170 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, 2009లో 209 కోట్లకు చేరిందన్నారు.
 

రాజీనామా అంశంపై ఏమైనా ఒత్తిడి ఉందా?అని విలేకర్లు ప్రశ్నించగా.. ఎటువంటి ఒత్తిడి తనపై లేదన్నారు. కాగా, సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాజీనామాను త్వరలోనే ఆమోదింపజేసుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన కేంద్రమంత్రులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం అనేది వారి ప్రాధమిక హక్కు అని లగడపాటి తెలిపారు. ఇందులో భాగంగానే లోక సభ స్పీకర్ మీరా కుమార్ ను సోమవారం కలవడానికి ప్రయత్నించానన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరా కుమార్ మంగళవారం కూడా కార్యాలయానికి రాలేదన్నారు.  అక్టోబర్ 17 వ తేదీన తప్పకుండా స్పీకర్ ను కలిసి రాజీనామాను ఆమెదించుకుంటానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement