ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్ | No threat to UPA government, says Sai Prathap | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్

Published Mon, Oct 14 2013 4:00 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్ - Sakshi

ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్

న్యూఢిల్లీ: తమ రాజీనామాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోదని రాజంపేట కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన నేడు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ రాజీనామా ఆమోదం కోసం స్పీకర్ను కలవాలని వచ్చినట్టు తెలిపారు. రాజీనామా ఆమోదంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరామన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఉండవల్లి, లగడపాటి, అనంత, తాను ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. సమైక్యవాద పార్టీల నాయకులను తమ పార్టీ నేతలు కలిస్తే తప్పేందని ఆయన ప్రశ్నించారు. 

అంతకుముందు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement