Rajampet MP
-
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం
చిట్వేలి: సమాజంలో బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చిట్వేలి మండలం యన్.ఉప్పరపల్లెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక పోయినా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు నాయకులు గణాంకాలతో గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, నాయకులు చొప్పా వెంకటరెడ్డి, మహేష్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, చంగల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గౌసియా, నరసింహులు, కరిముల్లాఖాన్, బషీరుద్దీన్, వెంకటరమణ, లోకేష్, పద్మాకర్ పాల్గొన్నారు. -
మిథున్‌రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర
తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్
న్యూఢిల్లీ: తమ రాజీనామాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోదని రాజంపేట కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన నేడు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ రాజీనామా ఆమోదం కోసం స్పీకర్‌ను కలవాలని వచ్చినట్టు తెలిపారు. రాజీనామా ఆమోదంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరామన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఉండవల్లి, లగడపాటి, అనంత, తాను ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. సమైక్యవాద పార్టీల నాయకులను తమ పార్టీ నేతలు కలిస్తే తప్పేందని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు.