జీర్ణించుకోలేకే జగన్‌పై విమర్శలు: అడుసుమల్లి
హైదరాబాద్: సమైక్య నినాదాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బలంగా వినిపించడం జీర్ణించుకోలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాదని.. రాజగోపాల్‌లో ఢిల్లీ వీధులలో రాజకీయ డ్రామాలు ఆడడమే పనిగా ఆయన పేర్కొన్నారు.
జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు.